మన న్యూస్ పుతలపట్టు నియోజకవర్గం మే-30

కాణిపాకం‌ స్వయంభూ శ్రీ వరసిద్ది వినాయక స్వామి వారి దేవస్ధానం అనుబంధ ఆలయం శ్రీ వీరాంజనేయ స్వామి వారి ఆలయం జీర్ణోద్ధరణ, అష్టబంధన, మహా సంప్రోక్షణ, మహా కుంభాభిషేకం మహోత్సవం శుక్రవారం శాస్త్రోక్తంగా జరిగింది. కాణిపాకం దేవస్ధానంలోని శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయం పునర్నిర్మాణానంతరం ఆలయంలో నిర్వహించిన జీర్ణోద్ధరణ, అష్టబంధన,‌మహా సంప్రోక్షణ, మహా కుంభాభిషేకం కార్యక్రమానికి మూడోవ రోజు పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ శ్రీ కలికిరి మురళీమోహన్ ముఖ్య అతిధిగా హాజరై మహా కుంభాభిషేకం మహోత్సవంలో భాగంగా ఆలయంలో వేద పారాయణం, విమాన గోపురంకు ఛాయా స్నపనము, కృమాంగ స్నపనము, లఘు పూర్ణాహుతి, ఆవాహిత దేవతారాధన మరియు హోమాలు,‌ కళాపకర్షణము మొదలైన ప్రత్యేక పూజాద కార్యక్రమాల్లో పాల్గోన్నారు. అంతకముందు శ్రీ వరసిద్ది వినాయక స్వామి వారిని ఎమ్మెల్యే మురళీమోహన్ దర్శించి ఆశీస్సులు అందుకున్నారు. అనంతరం ఆలయ వేద ఆశీర్వాద మండపంలో వేద పండితులు వేద ఆశీస్సులు అందించగా, ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో కాణిపాకం దేవస్ధానం ఈవో పెంచల కిషోర్, ఐరాల మండల అధ్యక్షులు గంగారపు హరిబాబు నాయుడు, ఐరాల జెడ్పీటీసీ సుచిత్ర కన్నయ్య నాయుడు, మాజీ కాణిపాకం దేవస్ధానం మాజీ ఛైర్మన్ మణినాయుడు, మాజీ జెడ్పీటీసీ లతా బాబునాయుడు, మాజీ సర్పంచ్ మధుసూదనరావు మరియు నాయకులు, కార్యకర్తలు, కాణిపాకం‌ దేవస్ధానం సిబ్బంది పాల్గోన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *