మన న్యూస్ పుతలపట్టు నియోజకవర్గం మే-30

బంగారుపాళ్యం, తవణంపల్లి మరియు ఐరాల మండలంలోని మామిడి రైతులకు పండు ఈగ బుట్టలు రాయితీపై ఉద్యాన శాఖ సబ్సిడీపై సరఫరా చేస్తున్నట్టు ఉద్యాన శాఖ అధికారి సాగరిక తెలిపారు. వారు మాట్లాడుతూ ఇప్పటికే పండు ఈగ రైతుల పొలాల్లో గమనించడం జరిగిందని పండు ఈగ వల్ల వాటిల్లే నష్టాన్ని నివారించడానికి 1 బుట్ట మరియు 3 లూర్లు రూ 11 రూపాయలకు రైతులకు అందిస్తున్నారు ఒక ఎకరాకు 8 బుట్టలు రెండున్నర ఎకరాకి 20 బుట్టలు ప్రతి రైతుకు 40 బుట్టలు వరకు అందిస్తున్నారు. కావలసిన రైతులు పొలం పాసు పుస్తకం జిరాక్స్, ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకుని బంగారుపాళ్యం మండలం తహసిల్దార్ కార్యాలయం ప్రక్కన ఉన్న రైతు సేవా కేంద్రమునకు తీసుకు రాగలరని సోమవారం నుండి రైతులకు పండు ఈగ బుట్టలు అందుబాటులో ఉంటాయని ఉద్యాన అధికారి సాగరిక తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *