ఎస్ఆర్ పురం,మన న్యూస్ :- ఎస్ ఆర్ పురం మండలం ఎస్ ఆర్ పురం శ్రీ ద్రౌపతి సమేత ధర్మరాజుల వారి ఆలయం వద్ద 32వ మహాభారత ఉత్సవాలు శుక్రవారం ప్రారంభమైంది శుక్రవారం ఉదయం ఎస్ఆర్ పురం మహాభారత యజ్ఞం నిర్వహించారు ఉదయం 10 గంటలకు శ్రీ ద్రౌపతి సమేత ధర్మ భీమా అర్జున నకుల సహదేవుల కు పూజలు నిర్వహించి అనంతరం ధ్వజారోహణం గణపతి పూజ యజ్ఞ పూజలునిర్వహించారు 30వ తేదీ నుంచి జూన్ 15వ తేదీ వరకు ప్రతిరోజు మధ్యాహ్నం డాక్టర్ విజయ కుమారి వారిచే హరికథ నిర్వహిస్తారు అలాగే జూన్ 6వ తేదీ నుంచి జూన్ 15వ తేదీ వరకు శ్రీ వెంకటేశ్వర కళానాట్యమండలి వారిచే రాత్రి వీధి నాటకం నిర్వహిస్తారు అని ఆలయ ధర్మకర్త వేణు నాయుడు కార్యనిర్వకులు ఎత్తి రాజుల నాయుడు తెలిపారు ధ్వజారోహణం ఉభయదారులుగా భారతి సుబ్రహ్మణ్యం నాయుడు వ్యవహరించారు ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు గంధమనేని రాజశేఖర్ నాయుడు గొల్లపల్లి సుబ్రహ్మణ్యం నాయుడు బ్రహ్మయ్య నాయుడు, చుట్టుపక్కల గ్రామస్తులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *