గొల్లప్రోలు మే 30 మన న్యూస్ :– శుక్రవారం ఐసీడీఎస్ చేబ్రోలు సెక్టార్ సూపర్వైజర్ కె మానసాదేవి ఆధ్వర్యంలో కిషోరి వికాసం వేసవి శిక్షణ తరగతులు సెషన్ 9 లో భాగంగా ఆర్థిక అంశాల నిర్వహణ మరియు పొదుపు ఈ అంశంపై గొల్లప్రోలు మండలం ఏ పి యమ్ సన్యాసి రావు, విలేజ్ లెవెల్ డ్వాక్రా సి సి యన్ రాజకుమారి,కెవెంకటరమణ, విఓఏ లు కిషోరి బాలికలకు వివరించారు.తదనంతరం సూపర్వైజర్ మానసదేవి బాలల చట్టాలు, ,బాల్యవివాహాలు నియంత్రణ,రుతుక్రమంలో పాటించవలసిన జాగ్రత్తలు,స్కిల్స్ ఎలా డెవలప్ చేసుకోవాలి ప్రభుత్వం కిషోరి బాలికలకు అందిస్తున్న అవకాశాలు ,సమాజంలో చైతన్య వంతులుగా ఎదగడానికి శారీరక ఆరోగ్యం తో పాటుగా మానసిక ఆరోగ్యం కూడా చాలా అవసరం ఇది 5000 ల సంవత్సరాల క్రితం నాటి పతంజలి మహర్షి వారి యోగ సాధన వలన సాధ్యమని యోగా ప్రతి నిత్యం కుటుంబం లో అందరూ చెయ్యాలని వారికి వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *