మన న్యూస్,నారాయణపేట:- జిల్లా పరిధిలోని మక్తల్ మండలం లోని పసుపుల శ్రీ గురుదత్త దేవాలయం వద్ద మహిళలకు షి టీమ్ పోలీసులు పలు సామాజిక అంశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా షి టీం పోలీసులు బాలరాజు మాట్లాడుతూ,నారాయణపేట జిల్లా పరిధిలో మహిళలు విద్యార్థులు ఎవరైనా వేధింపులకు గురైన మానసికంగా శారీరకంగా బాధపెట్టిన ధైర్యంగా నారాయణపేట షి టీమ్ పోలీసులకు వెంటనే 8712670398 నెంబర్ కు సమాచారం ఇవ్వాలని, ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచి అట్టి వ్యక్తుల పై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. మహిళలు ప్రయాణం చేసే సమయంలో తగిన జాగ్రత్తలు పాటించాలని దొంగతనాల పట్ల జాగ్రత్తగా ఉండాలని తమ విలువైన వస్తువులను జాగ్రత్తగా ఉంచుకోవాలని తెలిపారు. అలాగే సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సైబర్ నేరగాళ్లు చూపే మోసపూరిత ఆసులకు గురికాకుండా తగిన జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. అనుకోకుండా సైబర్ నేరానికి గురైతే 1930 టోల్ ఫ్రీ నెంబర్ కు సమాచారం ఇవ్వాలని తెలిపారు. ప్రజలు అత్యవసర సమయంలో డయల్ 100 కి సమాచారం ఇవ్వాలని షి టీమ్ పోలీసులు తెలిపారు. ఈ కార్యక్రమంలో షీ టీం పోలీసులు జ్యోతి, కవిత, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *