oplus_2

మన న్యూస్,నిజాంసాగర్ ( జుక్కల్ ) : బారడి పోచమ్మ తల్లి పండగసందర్భంగా నిజాంసాగర్ మండలంలోని సుల్తాన్ నగర్ గ్రామ శివారులో బారడి పోచమ్మ తల్లి ఆలయం వద్ద ఘనంగా కుస్తీ పోటీలను నిర్వహించారు.ఈ కుస్తీ పోటీలు ఎంతో ఉత్సాహంగా నిర్వహించారు.గ్రామ పెద్దల ఆధ్వర్యంలో కుస్తీ పోటీలు ఏర్పాటు చేయగా,ఈ కుస్తీ పోటీలను తిలకించేందుకు వివిధ గ్రామాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.చిన్నారుల నుంచి మొదలైన కుస్తీ పోటీలలో మల్ల యోధులు ఆసక్తి చూపించారు.కుస్తీ పోటీలలో విజేతలుగా నిలిచిన వారికి నగదు బహుమతి బహుకరించారు
చిట్ట చివరి కుస్తీ పోటీల్లో విజేతలు గా నిలిచిన వారికి ఐదు తులాల వెండి కడెం తో పాటు రూ.1000ల నగదు బహుమతితో సన్మా నించారు.ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు కూర్మ సాయిలు, ఎర్ల బ్యాతయ్య, వడ్ల బ్రహ్మం, షర్ఫుద్దీన్, మహిపాల్ రెడ్డి, చాంద్ పాషా, హుసేని, గ్రామ పంచాయతీ కార్యదర్శి రవి రాథోడ్, హైమద్ హుస్సేన్, షేక్ అహ్మద్, కారోబార్ సాయిలు గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

oplus_2048

By RAHEEM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *