గంగాధరనెల్లూరు, మన న్యూస్ :-గంగాధరనెల్లూరు నియోజకవర్గం ఎస్.ఆర్. పురం మండలంలో నిర్వహించిన మినీ మహానాడు కార్యక్రమం పురస్కరించుకొని నియోజకవర్గ శాసనసభ్యులు మరియు ప్రభుత్వ విప్ డాక్టర్ వి.మ్. థామస్ ని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు గురుసాల కిషన్ చంద్ మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు భాష్యం సతీష్ నాయుడు కలిసి డాక్టర్ థామస్‌ను దుశ్యాల వేశి, పూల బొకే అందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. ప్రాంతంలోని నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. కార్యక్రమం సందర్భంగా ప్రాంత అభివృద్ధిపై కీలకమైన చర్చలు జరిగాయని సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *