మహానాడు కార్యక్రమంలో 25 అంశాలు ఆమోదం
ఎస్ఆర్ పురం,మన న్యూస్… గంగాధర్ నెల్లూరు నియోజకవర్గాన్ని పరిశ్రమల హబ్ గా, నిర్మాణానికి కృషి చేస్తా అని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే డాక్టర్ థామస్ అన్నారు బుధవారం గంగాధర నెల్లూరు నియోజకవర్గం మినీ మహానాడు ఎస్ఆర్ పురం మండలం పుల్లూరు క్రాస్ రోడ్ లోని ఎస్ఎల్వీ కళ్యాణమండపంలో నిర్వహించారు ఎమ్మెల్యే డాక్టర్ థామస్ కు పసుపు జెండాలతో పూలవర్షంతో స్వాగతం పలికారు అలాగే క్రేన్ ద్వారా గజమాలతో ఎమ్మెల్యే డాక్టర్ థామస్ ను ఘనంగా సన్మానించి సత్కరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ కామర్స్ మాట్లాడుతూ ఈ మినీ మహానాడు సూపర్ సక్సెస్ అయిందని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే డాక్టర్ థామస్ అన్నారు అలాగే మినీ మహానాడులో 25 అంశాలను ప్రభుత్వ ఎమ్మెల్యే ఆమోదం తెలిపారు ఇంకా ఏదైనా కావాలంటే తనకు తెలియజేస్తే వాటి పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు ఎస్ఆర్ పురం మండలంలో బాలికల జూనియర్ కళాశాల ఫైర్ స్టేషన్ మంజూరు చేశానని అలాగే కార్వేటినగరం పెనుమూరు మండలాల్లో 50 పడకల ఆసుపత్రి అభివృద్ధికి కృషి చేస్తున్నానని తెలిపారు అలాగే చిత్తూరు తచ్చూరు జాతీయ రహదారి మన నియోజకవర్గంలో పరిధిలో పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేస్తున్నాను అని అన్నారు అలాగే కార్యకర్తలు తెలుగుదేశం పార్టీకి మూల స్తంభాలు అని కార్యకర్తల అభివృద్ధికి ఎల్లప్పుడూ కృషి చేస్తానని ఏ కార్యకర్త ఆధ్వర్యంలో ఎమ్మెల్యే డాక్టర్ థామస్ భరోసా ఇచ్చాడు… ఈ కార్యక్రమంలో ఎస్ ఆర్ పురం మండల పార్టీ అధ్యక్షుడు గంధమనేని జయశంకర్ నాయుడు జిల్లా తెలుగుదేశం నాయకులు గంధమనేని రాజశేఖర్ నాయుడు బి కే ఎన్ మునివర్ధనాయుడు, వేమన నాయుడు పైనేని మురళి, నియోజకవర్గ ఎస్సీ సెల్ కార్యదర్శి కుమార్ ఆర్టిఐ జిల్లా అధ్యక్షులు జయరాజ్, గంగాధర్ నెల్లూరు మండల అధ్యక్షుడు స్వామి దాస్ తెలుగుదేశం జిల్లా మహిళా అధ్యక్షురాలు అరుణ జిల్లా కార్యనిర్వహక కార్యదర్శి కృష్ణం నాయుడు యాదవ సాధికార సమితి జిల్లా అధ్యక్షుడు శ్రీధర్ యాదవ్, మండల ఉపాధ్యక్షులు నిరంజన్ రెడ్డి బీసీ సెల్ అధ్యక్షుడు హేమాద్రి యాదవ్ పుల్లూరు బాబు మాధవ నాయుడు గజేంద్ర తిరుమల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
