

Mana News, వెదురుకుప్పం :- ఓ ఘనమైన వివాహ వేడుకకు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. వెదురుకుప్పం భాస్కర్ రెడ్డి కుమార్తె మరియు సీనియర్ జర్నలిస్ట్ రఘునాథరెడ్డి కుమారుడు మధ్య జరిగిన ఈ వివాహం, గ్రామంలో సాంప్రదాయ విలువలు, కుటుంబ అనుబంధాలను ప్రతిబింబించేలా జరిగింది. ఈ వేడుకకు మాజీ ఉపముఖ్యమంత్రి మరియు రాష్ట్ర అడ్వైజరీ కమిటీ సభ్యులు కే. నారాయణస్వామి, సత్యవేడు నియోజకవర్గ ఇన్‌చార్జి నూక తోటి రాజేష్, స్థానిక నాయకులు, పార్టీ కార్యకర్తలు, బంధువులు, స్నేహితులు పెద్దఎత్తున హాజరయ్యారు. వధూవరులను ఆశీర్వదిస్తూ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేశారు. వివాహ వేదిక వద్ద సాంప్రదాయ సంగీతం, అలంకరణల మధ్య ఉత్సాహభరితంగా కార్యక్రమం కొనసాగింది.
