

మన న్యూస్ సింగరాయకొండ:- పాలీ సెట్ 2025లో రాష్ట్ర స్థాయిలో 167వ ర్యాంక్ (117/120 మార్కులు) సాధించిన సింగరాయకొండ మండలం, శానంపూడి గ్రామానికి చెందిన ఉపాధ్యాయుడు దనేకుల బలరాం కుమార్తె రూపాదేవిని రాష్ట్ర సంఘీక సంక్షేమ శాఖ మంత్రి శ్రీ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి నాయుడు పాలెం క్యాంపు కార్యాలయంలో అభినందించారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో ర్యాంకులు సాధించడం అభినందనీయమని, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో రాష్ట్రంలో విద్యా ప్రమాణాలు మెరుగుపడుతున్నాయని, నూతన విద్యావిధానంతో రాష్ట్రం అగ్రగామిగా ఉందని మంత్రి తెలిపారు. ర్యాంక్ సాధించిన రూపాదేవిని పలువురు ఉపాధ్యాయులు, ప్రముఖ న్యాయవాదులు సన్నిబోయిన శ్రీనివాసులు, పులివర్తి లక్ష్మీనారాయణ, సన్నిబోయిన వెంకటేశ్వర్లు, నరాల సుధాకర్, ఉపాధ్యాయులు అర్రిబోయిన రాంబాబు, అంబటి బ్రహ్మయ్య, మసనం జాలరత్నం, అంబటి ప్రసాద్ తదితరులు అభినందించారు. ఫిజికల్ డైరెక్టర్లు ఓగుబోయిన శ్రీనివాస్, పిగిలి శ్రీను, ఎన్.టి. ప్రసాద్, నర్రా కోటేశ్వరరావు, నామా చంద్రశేఖర్, వి. కోటేశ్వరరావు, వి. వెంకట్రావు, వై. నాగరాజు తదితరులు పాల్గొన్నారు.