

మన న్యూస్, నారాయణ పేట:- కోస్గి బస్టాండ్ లో దొంగతనాలు నిర్మూలించడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని కోస్గి పోలీసు కానిస్టేబుల్ అంబయ్య గౌడ్ తెలిపారు. శనివారం కోస్గి బస్టాండ్ లో ఫింగర్ ప్రింట్స్ డివైస్ తో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించడం జరిగిందని, బస్టాండ్ లో ప్రయాణికుల మాటున కొంతమంది వ్యక్తులు రద్దీగా ఉన్న సమయంలో దొంగతనాలకు పాల్పడుతున్నారని అలాంటి వాటికి చెక్ పెట్టడానికి ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.ప్రజలు ప్రయాణికులు దొంగతనాల పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. బస్టాండ్ లో ప్రయాణికులు బస్సు ఎక్కి దిగే సమయంలో జాగ్రత్తలు పాటించాలని మరియు తమ విలువైన బంగారు వస్తువులను బ్యాగులను, పర్సులను జాగ్రత్తగా ఉంచుకోవాలని మరియు అపరిచిత వ్యక్తులు ఏమైనా తినుబండరాలిస్తే తీసుకోరాదని ప్రయాణికులకు సూచించారు.