మన న్యూస్,నిజాంసాగర్,జుక్కల్ మండలంలోని గొల్ల తండాలో విషాదం నెలకొంది.శనివారం తెల్లవారుజామున విద్యుత్ షాక్ తో తల్లి కూతురు మృతి చెందారు. స్థానికుల కథనం ప్రకారం గుల్లతాండకు చెందిన చవాన్ శంకబాయ్ (36) కూతురు చవాన్ శివాని (14)ఇంట్లో నిద్రపోతున్న క్రమంలో ఎండ వేడిమి నివారణ కోసం కూలర్ పెట్టుకోగా ప్రమాదవశత్తు చవాన్ శివాని ఎడమ కాలు కూలర్ కోసం ఏర్పాటు చేసిన నీటిలో పడగా ప్రమాదవశాత్తు ఆ నీటిలో విద్యుత్ ప్రవహించి కాలు పాక్షికంగా కాలిపోవడమే కాకుండా ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. కూతురు పక్క నిద్రపోతున్న తల్లికి కూడా కూతురు ద్వారా విద్యుత్ ప్రవహించి ఆమె కూడా మృతి చెందింది. కొడుకు ప్రతీక్ బయట పడుకోవడం తో తెల్లవారుజామున ఇంట్లోకి వెళ్లి చూడగా తల్లి చెల్లెలు మృత్యువాత పడటంతో ఇట్టి విషయాన్ని తండా వాసులకు తెలుపడంతో వారు విద్యుత్ ను నిలుపుదల చేయించారు. కుటుంబ యజమాని అయిన ప్రహ్లాద్ చవాన్ డ్రైవర్ గా ఉండటంతో ఆయన ఇతర ప్రాంతాలకు వెళ్లినట్టు వారు తెలిపారు. ప్రహ్లాద్ చవాన్ కు భార్య ఇద్దరు కూతురులు ఒక కొడుకు ఉండగా భార్య చిన్న కూతురు మృత్యువాత పడటం మరో కూతురు బంధువుల వద్దకు పోవడంతో ప్రాణం దక్కిందని తండా వాసులు తెలిపారు. పోలీసులకు సమాచారం అందించడంతో జుక్కల్ పోలీసులతోపాటు బిచ్కుంద సీఐ జగడం నరేష్, ఎస్ఐ భువనేశ్వర్ సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు.

By RAHEEM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *