మన న్యూస్ ,కోవూరు ,మే 9:– చెన్నకేశవ స్వామి వారి అనుగ్రహంతో నిడుముసలి గ్రామం పాడి పంటలతో సుభిక్షంగా వుండాలని ఆకాంక్షించారు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి . ఇందుకూరుపేట మండలం నిడుముసలి గ్రామంలో శ్రీ శ్రీదేవి భూదేవి చెన్నకేశ్వర స్వామి ఆలయ విగ్రహ ప్రతిష్ట మరియు కుంభాభిషేకం కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిధిగా పాల్గొన్న ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి కి గ్రామస్థులు అపూర్వ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు చేసి ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి కి ఆశీర్వచనాలు అందచేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆర్ధిక సహాయంతో నిర్మించిన ఆలయ ప్రతిష కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ పవిత్ర కార్యక్రమంలో భాగస్వామురాలిని చేసిన నిడుముసలి వాసులకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. నిడుముసలి శ్రీదేవి భూదేవి చెన్నకేశ్వర స్వామి ఆలయం భవిష్యత్ తరాలకు పవిత్ర ఆధ్యాత్మిక క్షేత్రంగా విరాజిల్లాలని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారు ఆకాంక్షించారు. చెన్నకేశవస్వామి ఆశీస్సులతో నిడుముసలి వాసులు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో నిడుముసలి సర్పంచ్ దువ్వూరు పావని రెడ్డి టిడిపి నాయకులు చెంచుకిషోర్ యాదవ్, బెజవాడ వంశీకృష్ణా రెడ్డి, కోడూరు కమలాకర్ రెడ్డి స్థానిక నాయకులు మధుసూదన రెడ్డి, చైర్మన సుధాకర్ రెడ్డి, చైర్మన సురేష్ రెడ్డి, వినీల్ రెడ్డ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *