మన న్యూస్, సర్వేపల్లి ,మే 9:– అధికారులు, రైతులు సమన్వయంతో ముందుకు సాగాలి. *ఎక్కువ దిగుబడి కోసం ఆరుతడి పంటలకు ప్రాధాన్యమివ్వాలి.సర్వేపల్లి నియోజకవర్గం, తోటపల్లి గూడూరు మండలం ముంగలదొరువు వద్ద కోడూరు కాలువలో మరమ్మతులను శుక్రవారం పరిశీలించిన సందర్భంగా సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ………రైతులతో కలిసి పనుల పరిశీలన..నాణ్యతతో చేయించాలని ఇరిగేషన్ అధికారులకు సూచన చేశారు. రెండో పంటకు సుమారు 4 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని ఐఏబీ సమావేశంలో తీర్మానించాం అని అన్నారు.సర్వేపల్లి నియోజకవర్గంలో సుమారు ఒక లక్ష ఎకరాల్లో పంట పెడతారని భావిస్తున్నాం, అని అన్నారు.సోమశిల జలాశయంలో ప్రస్తుతం 50 టీఎంసీల నీటి నిల్వ ఉంది. తాగునీటి అవసరాలు, డెడ్ స్టోరేజీ పోను 35 టీఎంసీలు నికరంగా ఉంటాయి అని అన్నారు.సర్వేపల్లి, కనిగిరి రిజర్వాయర్లలోనూ అదనంగా నీళ్లు అందుబాటులో ఉన్నాయి అని తెలిపారు.కొందరు రైతులు రెండో పంట సాగుకు ఆసక్తి చూపుతుండగా, మరికొందరు వేయమంటున్నారు అని అన్నారు.
ఎవరు పంట పెట్టినా నీటిని పొదుపుగా వాడుకోవాలి..ఒక్క చుక్క నీటిని కూడా వృథా చేయవద్దు అని తెలియజేశారు.2023 రెండో పంట సీజన్ లో 1.05 లక్షల ఎకరాలకు 41 టీఎంసీల నీటిని వాడేశారు అని అన్నారు.వైసీపీ పాలనలో ఇరిగేషన్ పనులు చేయకుండానే చేసినట్లు చూపి వందల కోట్లు స్వాహా చేశారు అని అన్నారు.సర్వేపల్లి నియోజకవర్గంలోనూ రూ.150 కోట్లకు పైగా కుంభకోణం జరిగింది అని అన్నారు.కాలువలు రూపు కోల్పోవడంతోనే 1 టీఎంసీకి 10 వేల ఎకరాల్లో పంట పండించాల్సింది పోయి 1.05 లక్షల ఎకరాలకు 41 టీఎంసీలు ఖర్చు చేశారు అని అన్నారు.గతంలో జిల్లాలో సాగునీటి కొరత ఏర్పడినప్పుడు అందరిని సమన్వయం చేసుకుని ఎకరాకు 16 వేల ఎకరాల్లో పంట పండించిన చరిత్ర మాది అని తెలిపారు.వైసీపీ పాలన నాటి పరిస్థితులను మన ప్రభుత్వంలో పునరావృతం కానీయొద్దు అని తెలియజేశారు.కాలువలను బాగు పడుతున్నాయి. నీటిని పొదుపుగా వాడుకోవాలని రైతులను కోరుతున్నా అని అన్నారు.ఆరు తడులతో పంట దిగుబడి పెంచుకునే అంశాన్ని పరిశీలించాలని సూచిస్తున్నా.. అనే తెలిపారు.సాగునీటి సంఘాల ప్రతినిధులు, అధికారులు, రైతులు సమన్వయంతో ముందుకు సాగాలి అని తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *