నాడు నేడు ఎప్పుడు బీసీలకే పెద్దపీటo..స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ అసెంబ్లీలో చారిత్రాత్మక తీర్మానం.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి కృతజ్ఞతలు తెలియజేసిన ఉదయగిరి నియోజకవర్గ తెలుగు యువత సోషల్ మీడియా కోఆర్డినేటర్ మార్నేని రామకృష్ణ.
ఉదయగిరి/వరికుంటపాడు ఆగస్టు 18, మన న్యూస్ ప్రతినిధి నాగరాజు కె.
ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు నాడు నేడు ఎప్పుడు బీసీలకు పెద్దపీట వేస్తూ వారికి రాజ్యాధికారం అందించడమే లక్ష్యంగా కృషి చేస్తున్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో బలహీన వర్గాలకు 34% రిజర్వేషన్ కల్పిస్తామని, అసెంబ్లీలో బిల్లు పెట్టి చరిత్రాత్మక నిర్ణయం తీసుకొని బీసీలకు రాజ్యాధికారం కల్పించడమే కాకుండా ఆర్థిక అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడుకు ఉదయగిరి నియోజకవర్గం ప్రజల తరఫున బీసీ సోదరుల తరఫున కృతజ్ఞతలు తెలియజేసిన ఉదయగిరి తెలుగు యువత సోషల్ మీడియా కోఆర్డినేటర్ మార్నేని రామకృష్ణ. ఈ చారిత్రాత్మక నిర్ణయం ద్వారా బీసీలకు కార్పొరేషన్, మున్సిపల్, మండల పరిషత్ గ్రామ పంచాయతీ ఎన్నికలలో 34% కల్పించడం ద్వారా బీసీల ప్రజా ప్రతినిధులు పెరగనున్నాయని తద్వారా బీసీల అభ్యున్నతికి దోహదపడుతుందని తెలిపారు.గతంలో 20% ఉన్న రిజర్వేషన్లను ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు 34% కి పెంచడం జరిగిందని తెలిపారు. కానీ గత వైకాపా ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి 2019 లో బీసీల రిజర్వేషన్లను 34% నుంచి 24%కి తగ్గించి, బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికలలో 16,800 పదవులు బీసీలకు రానీయకుండా అన్యాయం చేశారని తెలిపారు. కానీ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత, స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు పెద్దపీట వేస్తూ మళ్ళీ స్థానిక సంస్థల ఎన్నికలలో 34% రిజర్వేషన్ కల్పిస్తూ అసెంబ్లీలో చరిత్రాత్మక నిర్ణయం తీసుకోవటం అది కూటమి ప్రభుత్వంలోని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బీసీల పక్షపాతిగా నిలిచారన్నారు. ఈ నిర్ణయం ద్వారా కూటమి ప్రభుత్వం మళ్లీ బీసీలకు రాజ్యాధికారంలో పూర్వ వైభవం తీసుకువస్తూ దాదాపుగా 16 వేల 800 మందికి రానున్న స్థానిక సంస్థల్లో జెడ్పి చైర్మన్లుగా, మండల అధ్యక్షులుగా, సర్పంచులుగా, మున్సిపల్ మేయర్లుగా, మున్సిపల్ అధ్యక్షులుగా నియమించడానికి అవకాశం దక్కుతుందని అన్నారు. అలాగే బీసీ విద్యార్థుల అభివృద్ధికి వివిధ శిక్షణ కోర్సులు ప్రభుత్వము ఉచితంగా కల్పిస్తూ బీసీల అభ్యున్నతికి కృషి చేస్తుందని అందుకు నిరంతరం తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉందని తెలిపారు. అలాగే బీసీలకు రక్షణ చట్టం ద్వారా బీసీలకు రక్షణ కల్పిస్తూ అండగా నిలుస్తున్న ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమని అది ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు కే సాధ్యమవుతుందని అన్నారు. ఈ అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కు, కుటామి ప్రభుత్వానికి, పవన్ కళ్యాణ్ కు యువ నాయకులు నారా లోకేష్ బాబు కు ఉదయగిరి నియోజకవర్గ ప్రజలు బీసీ సోదరులు తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు.