మన న్యూస్ ,నెల్లూరు రూరల్, మే 9:– నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మే 15వ తేదీన పెద్ద ఎత్తున 339 అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రివర్యులు పొంగూరు నారాయణ కి ఆహ్వాన పత్రికతో పాటు రూరల్ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల బుక్ లెట్ ను తెలుగుదేశం పార్టీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి అందజేశారు. నెల్లూరు నగరంలోని క్యాంపు కార్యాలయంలో ఈ మేరకు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి మంత్రి పొంగూరు నారాయణ తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.అనంతరం అనేక అంశాలను వారు మాట్లాడుకున్నారు. పై కార్యక్రమంలో మాజీ నగర మేయర్ నందిమండలం భాను శ్రీ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *