

మన న్యూస్,తిరుపతిః 44వ డివిజన్ మధురానగర్ లో 36.65 లక్షలతో నిర్మించిన సిమెంట్ రోడ్డును ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు గురువారం ఉదయం ప్రారంభించారు. ప్రారంభానికి విచ్చేసిన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులుకు జనసేన కార్పోరేటర్ వరికుంట్ల నారాయణ ఆధ్వర్యంలో కార్పోరేటర్లు ఘన స్వాగతం పలికారు. అనంతరం పూజాకార్యక్రమం తరువాత శిలాఫలకాన్ని ఎమ్మెల్యే ఆరణి ఆవిష్కరించి రోడ్డును ప్రారంభించారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నగరంలోని రోడ్ల ప్యాచ్ వర్కలను పూర్తి చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. గత పాలకుల తీరుతో మున్సిపల్ కార్పోరేషన్ ను అప్పుల కుప్పగా మారిందని ఆయన ఆరోపించారు. తిరుపతిని అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, యువనాయకులు ఐటి శాఖ మంత్రి లోకేష్ లు కట్టుబడి ఉన్నట్లు ఆయన చెప్పారు. కాగా నర్శరీరోడ్డు ఆక్రమణలతో రాకపోకలకు ఇబ్బందిగా మారిందని స్థానికులు ఎమ్మెల్యే కు విన్నవించుకున్నారు. రోడ్డును పరిశీలించి చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కార్పోరేషన్ ఎస్ ఈ శ్యామ్ సుందర్, ఎంఈ గోమతి, డిప్యూటీ మేయర్ ఆర్సి మునికృష్ణ, కార్పోరేటర్లు దూది కుమారి, సికే రేవతి, ఆదం సుధాకర్ రెడ్డి, దూది శివ, యాదవకృష్ణ, రాజా రెడ్డి, సుధాకర్, సాయిదేవ్ యాదవ్, బాజ్జీ, రాజేష్ ఆచ్చారి, ఆళ్వార్ మురళీ, ఆముదాల వెంకటేష్, ఆర్కాట్ కృష్ణ ప్రసాద్, కొండా రాజ్ మోహన్, రమేష్, సుధీర్, మునస్వామి, ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.