
మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం:ఏలేశ్వరం నగర్ పంచాయతీ 8వ వార్డులోని శివాలయం వద్ద ఉన్న స్నానాల ఘాట్‌ను ప్రత్తిపాడు నియోజకవర్గ శాసనసభ్యులు వరపుల సత్యప్రభ రాజ ఆదేశాల మేరకు ఏలేశ్వరం టౌన్ నాయకులు ముది నారాయణస్వామి, తెలుగుదేశం యువ నాయకులు బోదిరెడ్డి గోపి, క్షేత్రస్థాయిలో పరిశీలించారు.శివరాత్రి రోజున మండల చుట్టుపక్కల గ్రామాల నుండి అధిక సంఖ్యలో భక్తులు నదిలో పవిత్ర స్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకుంటారు.వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా స్నానాల ఘాట్ వద్ద తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు.స్నానాల ఘాట్ వద్ద రక్షణ చర్యలు, తాగునీరు మరియు భక్తులకి క్యూ లైన్ల నిర్వహణపై ఆలయ కమిటీకి కీలక సూచనలు చేశారు.
భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖల అధికారులకు సమన్వయంతో జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం కాకినాడ జిల్లా పార్లమెంట్ ఆర్గనైజర్ సెక్రెటరీ మామిడి లలిత,రెవిన్యూ,మున్సిపాలిటీ కమిషనర్, పోలీస్ డిపార్ట్మెంట్,హాస్పిటల్ చైర్మన్ వాగు రాజేష్, హాస్పిటల్ వైస్ చైర్మన్ జొన్నాడ వీరబాబు,కౌన్సిలర్లు ఎండగుండి నాగబాబు,రాయుడు చిన్న,కర్రోతు సత్యనారాయణ (గాంధీ),శశి స్వామి తదితరులు పాల్గొన్నారు.