

మన న్యూస్ ,గూడూరు, మే 5: శ్రీ శ్రీ శ్రీ విజయ దుర్గా పీఠాధిపతులు, వెదురుపాక గురుదేవుల వారి దివ్య ఆశీస్సులతో 2008 వ సంవత్సరం నాడు వైశాఖ పౌర్ణమి మహా పర్వదినం నాడు అభిజిత్ లగ్న కాలంలో గూడూరులోని శ్రీవిజయ దుర్గ అమ్మవారి ఉప పీఠంలో శ్రీ చక్ర ప్రతిష్ట స్వయంగా గు”రుదేవుల దివ్య హస్తాలతో ప్రతిష్ట చేసి 17 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మూడు వరస రోజులు వార్షికోత్సవ వేడుకలు నిర్వహించబడును.ఈ కార్యక్రమాల్లో భాగంగా, మే 10వ తేదీ శనివారం ఉదయం 9 గంటలకు
శ్రీ మహా మృత్యుంజయ అమృత పాశుపత మహా రుద్రాభిషేక సహిత హోమము జరుగును.సాయంత్రం 6 గంటలకు : శ్రీ మళ్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి శత్రుసంహార త్రిశతి హోమం విశేష రీతిలో నిర్వహించబడును. మే 11వ తేదీ, ఆదివారం ఉదయం 8 గంటలకు శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి జయంతి మరియు మన సత్సంగం నిలయంలో స్వామి వారి ప్రతిష్ట జరిగి నాలుగేళ్లు పూర్తవుతున్న సందర్భంగా స్వామివారికి చందనాభిషేకం నిర్వహించబడును.ఉదయం 9 గంటలకు: శ్రీ సుదర్శన లక్ష్మీనరసింహస్వామి వారి మహాయాగం నిర్వహించబడును. సాయంత్రం 6 గంటలకు : శ్రీ ఔషధ చక్ర నారాయణ మహా ధన్వంతరి యాగం, శ్రీ రాజశ్యామల మాతంగి, శ్రీ వారాహి అమ్మవారు, శ్రీ విజయ దుర్గ అమ్మవారి త్రిశతి హోమం నిర్వహించబడును.మే 12 తేది సోమవారం వైశాఖ పౌర్ణమి శ్రీ చక్ర వార్షికోత్సవ వేడుకలను పురస్కరించుకుని ఉదయం 9 గంటలకు : మాతృమూర్తులచే శక్తీమాల యాగం నిర్వహించబడును.9.30 గంటలకు మాతృమూర్తులచే సౌందర్యలహరి సామూహిక పారాయణ అదే సమయంలో అమ్మవారికి పరిమళ సుగంధ ద్రవ్యాలతో మరియు కనకాభిషేకం నిర్వహించబడును.
తదనంతరం సాయంత్రం 5 గంటలకు శ్రీ విజయ దుర్గా అమ్మవారి నక్షత్ర,నవగ్రహ పూర్వక అది దేవతా ప్రత్యధి దేవతా సహిత మహా నవావరణ హోమం మాతృమూర్తుల మంత్ర పఠనంతో నిర్వహించబడును.తదుపరి దశమహావిద్యలలోని అమ్మవార్ల మూలమంత్రంతో హోమం నిర్వహించబడును.కావున భక్తులందరూ పై విశేష కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి దర్శించి తీర్ధ ప్రసాదాలు స్వీకరించి అమ్మ కృపకు పాత్రులు కాగలరు.