

సీతారామపురం :(మన ద్యాస న్యూస్ ):ప్రతినిధి నాగరాజు :////
కంటి సంబంధిత అనారోగ్య సమస్యల కారణంగా చూపుకోల్పోయి వైద్య చికిత్సలు చేయించుకుంటున్న సీతారామపురం లోని సినిమా హాల్ వీధి కి చెందిన ఎడమకంటి సుబ్రహ్మణ్యం అనే నిరుపేదకు వైద్య ఖర్చుల నిమిత్తం 10,000 రూపాయలను నా సేన కోసం నా వంతు రాష్ట్ర కమిటీ మెంబర్, ఉదయగిరి నియోజకవర్గ జనసేన నాయకుడు భోగినేని కాశీరావు అందించారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఎడమ కట్టి సుబ్రమణ్యం పరామర్శించి, ఆరోగ్య సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం భోగినేని కాశీ రావు మాట్లాడుతూ ఎడమకంటి సుబ్రహ్మణ్యం అనే నిరుపేద సీతారామపురం లో అందరికీ సుపరిచితుడని, చిన్న వయసులోనే కంటిచూపు కి సంబంధించిన ఇబ్బందులు రావడం తీవ్ర బాధని కలిగించిందన్నారు.బాధిత కుటుంబాన్ని జనసేన పార్టీ తరఫున అన్ని విధాల ఆదుకునేందుకు ప్రయత్నిస్తామన్నారు. అదేవిధంగా ఉదయగిరి శాసనసభ్యుడు కాకర్ల సురేష్ సహకారంతో సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా బాధిత కుటుంబాన్ని ఆదుకునేందుకు చర్యలు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల మాజీ కన్వీనర్ ముత్తంశెట్టి చెన్నకేశవులు, మండల జనసేన నాయకుడు భోగినేని కాశీరత్తయ్య తదితరులు పాల్గొన్నారు.