

కొండాపురం : (మన ద్యాస న్యూస్ ):ప్రతినిధి,నాగరాజు ://///
వేములపాటి అజయ్ కుమార్ సూచనల మేరకు కొట్టే వెంకటేశ్వర్లు గారి సారథ్యంలో కొండాపురం మండలం జనసేన పార్టీ అధ్యక్షులు ఆకుల వెంకట్ ఆధ్వర్యంలో నూతన పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమం ఈరోజు అంగరంగ వైభవం గా ప్రారంభించారు.వెంకట్ మాట్లాడుతూ రాబోయే రోజులో పార్టీ ని బలోపేతం చేసి ప్రజల సమస్యలు ఎల్లవేళలా పరిష్కారం చేసే వీధంగా ముందుకు వెళ్తామని చెప్పుకొచ్చారు. అదేవిధంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో,ఎన్ డి ఏ, కూటమి సభ్యులు విజయానికి తమ వంతు కృషి చేస్తామని చెప్పారు.ఈ కార్యక్రమంలో ఉదయగిరి నియోజకవర్గం 8 మండలాల అధ్యక్షులు , ముఖ్య నాయకులు, జనసేన నాయకులు , కార్యకర్తలకు , వీర మహిళలకు , జనసైనికులకు, మెగా అభిమానులు పాల్గొని విజయవంతం చేసారు.
పై కార్యక్రమం లో కొండాపురం మండల ఉపాధ్యక్షులు అక్బర్ బాషా,రామనజపురం నీటి సంఘము అధ్యక్షులు ఆకుల వెంకటేశ్వర్లు, మండల కార్యవర్గ సభ్యులు బోట్లపాటి తిరుమల వాసు, పుప్పాల శ్రీనివాసులు, గిరి, వీర మహిళ ధనలక్ష్మి, వేముల మనిష్,కంచుపాటి మహేంద్ర, మధు, చిరంజీవి, మూలగిరి శ్రీనివాసులు, నారాయణ మరియు నియోజకవర్గం జనసేన నాయకులు నిమ్మలపల్లి రామ చైతన్య పాల్గొన్నారు.