

మన న్యూస్ తవణంపల్లె మే-5: మద్యం కేసుల్లో పట్టుబడిన వాహనాల బహిరంగ వేలంను చిత్తూరు జిల్లా తవణంపల్లి పోలీస్ స్టేషన్ నందు ఈనెల 13 వ తేదీన నిర్వహిస్తున్నట్లు తానంపల్లి పోలీస్ స్టేషన్ ఎస్ఐ చిరంజీవి ఒక ప్రకటనలో తెలియజేశారు. వివిధ ఎక్సైజ్ కేసులలో పట్టుబడిన ఒక ఇచ్చిర్, ఆరు మోటార్ సైకిల్ వాహనాలను చిత్తూరు జిల్లా అసిస్టెంట్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సుపరిండెంట్ ఎస్ కృష్ణ కిషోర్ వారి ఆధ్వర్యంలో ఈనెల 13వ తేదీ తవణంపల్లి పోలీస్ స్టేషన్ నందు వేలం నిర్వహిస్తున్నట్టు తెలియజేశారు. కావున ఈ వేళలో పాల్గొనదలచిన వ్యక్తులు తవణంపల్లి పోలీస్ స్టేషన్ నందు అదే రోజు ఉదయం 10 గంటలకు సంబంధించిన రుసుము చెల్లించి వేలంలో పాల్గొనవచ్చునని తెలియజేశారు మరియు ఇతర వివరాలకు తవణంపల్లి స్టేషన్ నందు సంప్రదించాలని కోరారు.