

మన న్యూస్ వింజమూరు : వింజమూరు మండల కేంద్రంలోని బొమ్మ రాజు చెరువు సమీపంలో ఉన్న తెలుగుదేశం ప్రధాన పార్టీ కార్యాలయంలో, ఆదివారం అతిరథ మహారధులు కొలువుదీరారు.
వరికుంటపాడు మండలం పెద్దిరెడ్డి పల్లి గ్రామంలో నూతనంగా అత్యంత సుందరంగా నిర్మించిన గ్రామ దేవత శ్రీ అంకాలమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట మహోత్సవాన్ని పురస్కరించుకొని, అక్కడికి వెళ్లే క్రమంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి, నెల్లూరు పార్లమెంటు సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీలు శ్రీ బీద రవిచంద్ర, శ్రీ కంచర్ల శ్రీకాంత్, పార్టీ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. వారందరికీ ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ అపూర్వ స్వాగతం పలికారు. శాలువాలతో ఘనంగా సన్మానించారు. కార్యాలయంలో కొద్దిసేపు ముచ్చటించుకుని ఆ తర్వాత శ్రీ అంకాలమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొనేందుకు బయలుదేరి వెళ్లారు. వీరితోపాటు మాజీ ఎమ్మెల్యే కంభం విజయరామి రెడ్డి, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ పొన్నుబోయిన చంచల బాబు యాదవ్, రాష్ట్ర కార్యదర్శి మన్నేటి వెంకటరెడ్డి, మాజీ పోలీస్ హౌసింగ్ సొసైటీ చైర్మన్ మెట్టుకూరి చిరంజీవి రెడ్డి, పొలిటికల్ మేనేజర్ మాలేపాటి చైతన్య, కాకర్ల వెంకట్, జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి చల్లా వెంకటేశ్వర్లు యాదవ్, కలిగిరి మండల కన్వీనర్ బిజ్జం కృష్ణారెడ్డి, మాజీ మండల కన్వీనర్ గూడా నరసారెడ్డి, సీనియర్ నాయకులు గణపం సుదర్శన్ రెడ్డి, మంచాల శ్రీనివాసులు నాయుడు, వనిపెంట సుబ్బారెడ్డి, జూపల్లి రాజారావు, దాట్ల కృష్ణారెడ్డి, టీడీపీ నాయకులు, కార్యకర్తలు,తదితరులు ఉన్నారు.