

మన న్యూస్ ,నెల్లూరు రూరల్ ,మే 4:– నెల్లూరు రూరల్ నియోజకవర్గం, చింతరెడ్డిపాళెంలోని నెల్లూరు రూరల్ నియోజకవర్గ సమన్వయకర్త ఆనం విజయకుమార్ రెడ్డి నివాసం నందు 17వ డివిజన్ మరియు 18వ డివిజన్ నాయకులు మరియు కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆనం విజయకుమార్ రెడ్డి మాట్లాడుతూ………..నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రతి ఒక్క వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు మరియు కార్యకర్తలకు అండగా ఉంటానని తెలియజేశారు.వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ 17వ డివిజన్ ఇంచార్జ్ గా మల్లి హరిబాబుని నియమించారు.వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ 18వ డివిజన్ ఇంచార్జ్ గా నాగోలు భాను ప్రకాశ్ రెడ్డిని నియమించారు. ప్రతి ఒక్క నాయకులకు మరియు కార్యకర్తలకు పార్టీ బోలోపేతంకి కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు చెవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి రావు శ్రీనివాస్ రావు (RSR), రాష్ట్ర బీసీ సెల్ జాయింట్ సెక్రెటరీ శ్యామ్ సింగ్, నెల్లూరు రూరల్ నియోజకవర్గ, ఎంప్లాయస్ & పెన్షనర్స్ విభాగ అధ్యక్షుడు కనకట్ల మోహన్ రావు ముదిరాజ్, 17వ డివిజన్ మరియు 18వ డివిజన్ ముఖ్య నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.
