

రౌతులపూడి మన న్యూస్ (అపురూప్): వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రౌతులపూడి మండల మహిళ విభాగానికి అధ్యక్షరాలుగా దెయ్యాల బేబీ నియమితులయ్యారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ద్వారా స్థానిక సంస్థల ఎన్నికలలో ప్రజా ప్రతినిధిగా ప్రజలకు చేసిన విశేష సేవలకు గాను, ఈ గుర్తింపు లభించిందని పలువురు పార్టీ కార్యకర్తలు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రత్తిపాడు నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కో-ఆర్డినేటర్ ముద్రగడ గిరి బాబు మాట్లాడుతూ, రాబోవు రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేయాలని, పార్టీ మనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని, నిరంతరం ప్రజల పక్షాన నిలబడి ప్రజా సమస్యలపై పోరాడాలని కార్యకర్తలకు పిలుపునిస్తూ, పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులుగా ఎన్నికైన సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. రౌతులపూడి మండల యూత్ వింగ్ సోమరౌతు రాజా, వాలంటీర్స్ వింగ్ కరక అశోక్, సోషల్ మీడియా వింగ్ బొడ్డు నాని, రైతు విభాగం కర్రి చిట్టిబాబు, బీసీ సెల్ సింగంపల్లి చిట్టిబాబు, ఎస్టీ సెల్ చెన్నాడ దేవుడు, మైనార్టీ సెల్ షేక్ వల్లి, క్రిస్టియన్ మైనార్టీ సెల్ బండారు బైరాగి, స్టూడెంట్ వింగ్ రౌతు ఫణి దుర్గా నారాయణ, పంచాయితీ రాజ్ వింగ్ భీమలింగం నాగరాజు, వాణిజ్య విభాగం బండారు వెంకన్నబాబు, పబ్లిసిటీ వింగ్ మంతెన పాపారావు లను రౌతులపూడి మండల అనుబంధ విభాగాల అధ్యక్షులుగా నియమిస్తూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి ప్రకటన విడుదల చేశారు.