

శేరిలింగంపల్లి మే 03 మన న్యూస్ :- శేరిలింగంపల్లి నారాయణ పాఠశాల విద్యార్ధులు అసాధారణమైన విజయాలను సాధించారు. మా విద్యార్థిని అక్షయ రాష్ట్ర స్థాయిలో 4 వ ర్యాంక్ ను సాధించింది. అంతేకాక, 114 విద్యార్థులు 550 కి పైగా మార్కులను పొందారు. 160 మంది విద్యార్థులు 500 కి పైగా మార్కులను పొందారు. ఈ సందర్భంగా ఎజియం వేణుగోపాల్ గారి ఆధ్వర్యం లో సక్సెస్ మీట్ ను నిర్వహించి, విద్యార్థులను అభినందించారు. ఈ ఫలితాలకు ముఖ్య కారణం అయిన తల్లిదండ్రుల అచంచలమైన అంకిత భావం, మరియు విద్యార్థులు ఉపాధ్యాయులు చేసిన కృషి అభినందిచదగినవి. అంతేకాక, 100% రిజల్ట్ ను కైవసం చేసుకుంది. ఇలాంటి ఫలితాలు అందించడంలో నారాయణ విద్యా సంస్థలు ఎప్పుడూ ముందు ఉంటాయని ముఖ్య అతిథిగా పాల్గొన్నఎజి యం వేణుగోపాల్ అన్నారు. ఈ కార్యక్రమంలో నారాయణ విద్యా సంస్థల డి జి యం గోపాల్ రెడ్డి పాఠశాల ప్రిన్సిపల్ గుణవతి పట్నాయక్ ఆర్ డి హెడ్ శ్రీలక్ష్మి , కోఆర్డినేటర్ బాల కృష్ణ డీన్లు వెంకటేశ్వర్లు మరియు రాజేశ్వరి ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థినీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.