

మన న్యూస్ , సర్వేపల్లి, మే 1 :- 10 ఆంధ్ర నేవల్ యూనిట్ యన్ సి సి నెల్లూరు లెఫ్టినెంట్ కమాండర్ మరియు క్యాంపు కమాండెంట్ గణేష్ గొదంగవే సారథ్యంలో 10 ఆంధ్ర నేవల్ యూనిట్ యన్ సి సి యాన్యువల్ ట్రైనింగ్ క్యాంప్-3 శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం సరస్వతి నగర్ లోని అక్షర విద్యాలయ నందు నిర్వహింపబడుతున్నది.
ఈ క్యాంపులో గురువారం శారీరక వ్యాయామం, నౌక నమూనా నిర్మాణం,ఆయుధ శిక్షణ,పర్సనాలిటీ డెవలప్ మెంట్, గన్ ఫైరింగ్, డ్రిల్,బేసిక్ డ్రిల్, ఆరోగ్యం పరిశుభ్రత, పెరేడ్ ట్రైనింగ్, నేవల్ కమ్యూనికేషన్, నేవల్ ఓరియంటేషన్, ప్రకృతి వైపరీత్యాలు తదితర విషయాలపై శిక్షణ,వ్యక్తిత్వ వికాసం అంశంపై అతిధి ఉపన్యాసం ఏర్పాటు చేసి క్యాండిడేట్ల కు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా క్యాంపు కమాండెంట్ లెఫ్ట్నెంట్ గణేష్ గొదం గవే మాట్లాడుతూ ఎన్ సి సి కేడేట్లు బాల్యం నుంచే మంచి ఆరోగ్యపు అలవాట్లు,సజ్జన సాంగత్యం, క్రమశిక్షణ,నాయకత్వ లక్షణాలు, పోరాట పటిమ, కష్టించే తత్వం, జాతీయ భావం, దేశభక్తి, సేవాభావం సామాజిక దృక్పధం అలవరచు కొనేలా వారిని దేశ ఉత్తమ పౌరులుగా ఎదిగేలా కేడేట్లకు ఈ క్యాంపులో తగు శిక్షణనిచ్చి దేశ సేవలో తరించేలా తీర్చి దిద్దుతున్నామన్నారు. అనంతరం నిర్వహించిన ఆటలు, క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలలో కేడేట్లు అత్యంత ఆనందోత్సాహాలతో పాల్గొన్నారు.ఈ శిక్షణా కార్యక్రమంలో ఎన్సిసి క్యాంపు అడ్జటెంట్ ఆఫీసర్ గుండాల నరేంద్ర బాబు,సబ్ లెఫ్ట్నెంట్ మల్లికార్జున రెడ్డి, థర్డ్ ఆఫీసర్లు మస్తానయ్య, కొండారెడ్డి,విద్యా సాగర్, అరోరా, సాయి శంకరి,పి ఐ స్టాఫ్ వైకుంఠం చీఫ్ ఇన్స్ట్రక్టర్, పెట్టీ ఆఫీసర్లు రంజన్, లోకేష్, లక్ష్మణ్, దీపక్,వెంకటేష్, రమణారావు, నవీన్, ఆఫీస్ సిబ్బంది సూపరింటెండెంట్ ముకుంద సాగర్, షిప్ మోడలింగ్ ఇన్స్ట్రక్టర్ రామన్,సీనియర్ అసిస్టెంట్లు షెహనాజ్ బేగం, కల్పన,జూనియర్ అసిస్టెంట్ సుజాత తదితరులు పాల్గొన్నారు. ఈ శిక్షణా శిభిరానికి మొత్తం 573 మంది ఎన్సిసి క్యాడెట్లు హాజరై శిక్షణ పొందుతున్నారు.
