

మన న్యూస్ ,నెల్లూరు, మే 1 :- కోవూరు నియోజకవర్గం పోతిరెడ్డిపాలెం వద్ద జరిగిన కారు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందడం అత్యంత విషాదకరమని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి అన్నారు. కారు ఓ ఇంట్లోకి దూసుకెళ్లడంతో ఇంటి యజమాని రమణయ్యతో పాటు నారాయణ మెడికల్ కాలేజీ విద్యార్థులు యగ్నేష్, జీవన్ నారాయణ, నరేష్, అభిసాయి, అభిషేక్ మృతి చెందడం తీవ్రంగా కలచివేసిందన్నారు. ఇటువంటి దుర్ఘటన చోటు చేసుకోవడం అత్యంత బాధాకరమని అన్నారు.
మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు. అలాగే బాధిత కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యం ఇవ్వాలని, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు.