మన న్యూస్,తిరుపతి:- రాష్ట్రంలోని ప్రతి కార్మికుడికి మెరుగైన జీవనంతో పాటు స్థిరమైన ఆదాయం భద్రత కల్పించడమే తెలుగుదేశం ప్రభుత్వం లక్ష్యమని రాష్ట్ర యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ తెలిపారు. రేణిగుంట రోడ్డు లోని టిడిపి పార్లమెంటు కార్యాలయం నరసింహ యాదవ్ ఆధ్వర్యంలో కార్మిక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టిఎన్టియుసి జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికుల దినోత్సవం తెలుగుదేశం పార్టీ గౌరవిస్తుందని, కూలీల కార్మికుల సంక్షేమానికి నారా చంద్రబాబు నాయుడు పెద్దపీట వేస్తున్నారన్నారు. టిడిపి పాలనలో కార్మికుల సంక్షేమం కోసం శ్రామిక భీమా పథకం, కౌలు కార్మికులకు వృత్తి నైపుణ్యాభివృద్ధి శిక్షణ, వృత్తి ఆధారిత ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తుందని చెప్పారు. కార్మికులు ఎవరైనా ప్రమాదవశాత్తు మరణిస్తే ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం చేయడం జరుగుతుందని చెప్పారు. నిరుద్యోగ యువతీ యువకులకు శిక్షణ కార్యక్రమాలు, కార్మికులకు ఆధునిక వృత్తి నైపుణ్యాలపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి దంపూరి భాస్కర్ యాదవ్, రాష్ట్ర నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్, టిడిపి నగర ప్రధాన కార్యదర్శి నైనారు మహేష్ యాదవ్, టిడిపి తిరుపతి పార్లమెంట్ కార్యదర్శి యశ్వంత్ రెడ్డి రవిశంకర్ యాదవ్, చెంబకూరు రాజయ్య, లోకేష్ రెడ్డి అప్ప నాయుడు సుబ్బారావు, సిరి వేలు భారతి, గంధం బాబు, రామారావు పలువురు కార్మికులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *