

శేరిలింగంపల్లి 23ఏప్రిల్ మన న్యూస్:- కొండాపూర్ డివిజన్ పరిధిలోని గచ్చిబౌలి లో గల ప్రభుత్వ ప్రైమరీ హై స్కూల్ ఆవరణలో సిఎస్ఆర్ నిధులతో రూ. 2 కోట్ల రూపాయల అంచనావ్యయంతో నూతనంగా చేపట్టబోయే నూతన పాఠశాల భవన నిర్మాణం పనులకు జోనల్ కమీషనర్ ఉపేందర్ రెడ్డి,కార్పొరేటర్లు హమీద్ పటేల్,ఉప్పలపాటి శ్రీకాంత్ లతో తో కలిసి ఎమ్మెల్యే గాంధీ శంకుస్థాపన చేశారు.అనంతరం ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ అధునాతన సకల హంగులతో, కొత్త సొగసును సంతరించుకుంటున్నాయి. చూడముచ్చటైన తరగతి గదులు క్లాస్‌రూంలో డ్యూయల్ డెస్క్‌లు.విద్యుత్తు వెలుగులు.పరిశుభ్రమైన టాయిలెట్లు.స్వచ్ఛమైన మంచినీళ్ల ట్యాంక్‌లు వంటగదులు భోజనశాలలు వాకింగ్ ట్రాక్‌లు. చుట్టూ ప్రహరీలు ఇలా అనేక సకల సదుపాయాలతో విద్యార్థులు ఏకాగ్రతతతో నిశ్చింతగా చదువులు కొనసాగించేందుకు అవసరమైన ఆహ్లాదకర వాతావారణాన్ని పంచిపెడుతున్నాయన్నారు.ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతుల కల్పనే ధ్యేయంగా పని చేస్తున్నమన్నారు.నిర్మాణ పనులను నాణ్యతగా చేయాలని సంబంధిత కాంట్రాక్టర్ ను ఎమ్మెల్యే ఆదేశించారు.ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు నీరుడి గణేష్ ముదిరాజ్, ఎర్రగుండ్ల శ్రీనివాస్ యాదవ్, బుడుగు తిరుపతి రెడ్డి, శ్రీనివాస్ చౌదరి, మంగళరాపు తిరుపతి పటేల్, నరసింహ సాగర్, బసవరాజు, లక్ష్మి బాయి, తిరుపతి యాదవ్, స్వామి సాగర్, వెంకటి, షణ్ముఖ్, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, నాయకులు, కార్యకర్తలు, మహిళలు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.