

మన న్యూస్ నర్వ :- *నిన్న సాయంత్రం కాశ్మీర్ లోని అనంతనాగ్ జిల్లా, పహెల్గాంలో కొంత మంది పాకిస్థాన్ ఉగ్రమూకలు అమాయకులైన 28 మంది భారతీయులను నిర్దాక్షిణ్యంగా కాల్చి వేసిన ఘటన యావత్ భారతదేశాన్ని కంట తడి పెట్టించే విదంగా చేసిందని రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బంగ్ల లక్ష్మికాంత్ రెడ్డి అన్నారు.
ఇట్టి సంఘటన పైన మక్తల్ నియోజకవర్గం నర్వ మండల కేంద్రంలో బీజేపీ మండల అధ్యక్షుడు టి అజిత్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బీజేపీ పదాది కారుల సమావేశంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బంగ్ల లక్ష్మికాంత్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ పహెల్గాం దుర్ఘటన ఒక పిరికిపంద చర్యగా, అమానవీయ దుశ్చర్యగా ఉందని భావించారు.పహెల్గామ్ దాడికి త్వరలోనే ప్రపంచం ఉలిక్కి పడే విదంగా శ్రీ నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రతీకారం తీర్చుకుంటుందని,హెచ్చరించిన బంగ్ల లక్ష్మికాంత్ రెడ్డి. ఇట్టి కార్యక్రమాన్ని నర్వ మండల కేంద్రంలో అంబేద్కర్ కూడలిలో ఉగ్రవాదుల చేతిలో అమరులైన భారతీయులు కు నివాళులర్పించి క్యాండిల్స్ వెలగించి సంతాపం,తెలియజేసిన నర్వ మండల భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు అజిత్ సింహ రెడ్డి,సీనియర్ నాయకులు జగన్నాథం,డాక్టర్ బాబు, ఆర్మీ హనుమంత్,హోటల్ హనుమంత్ రెడ్డి, టి రాంరెడ్డి,విజయరామ్, రాయికోడ్ శ్రీనివాస్ రెడ్డి,నర్వ మండల వివిధ గ్రామాల భూత్ అధ్యక్షులు వివిధ మోర్చాల అధ్యక్షులు బీజేవైఎం పదాధికారులు నర్వ మండల భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు హిందూ బంధువులు మరియునర్వ గ్రామ ప్రజలు యువకులు తదితరులు పాల్గొన్నారు*
