

మన న్యూస్, నెల్లూరు,ఏప్రిల్ 22:– క్యాథలిక్‌ల అత్యున్నత మత గురువు పోప్ ఫ్రాన్సిస్ మరణం పట్ల నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి సంతాపం తెలియజేశారు. పోప్ ఫ్రాన్సిస్ అందించిన సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. సామాజిక న్యాయం, ప్రపంచ శాంతికి ఆయన అవిశ్రాంతంగా పోరాటం చేశారని కొనియాడారు. లక్షలాది మందికి స్ఫూర్తిని ఇచ్చిన ఆధ్యాత్మిక గురువు పోప్ ఫ్రాన్సిస్ మరణం తనకు బాధ బాధ కలిగించిందని అన్నారు. కేవలం మతపరమైన నాయకుడిగా మాత్రమే కాకుండా, ఆయన నిజమైన మానవతావాది అని, ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది హృదయాల్లో కరుణ, వినయం, ఆధ్యాత్మిక ధైర్యానికి ప్రతీకగా నిలిచిపోతారని పత్రిక ప్రకటన ద్వారా పేర్కొన్నారు.