

Mana News, శ్రీకాళహస్తి: పదోన్నతులు కల్పించాలని గ్రామ రెవెన్యూ సహాయకులు ఉమ్మడి తిరుపతి రెవిన్యూ డివిజనల్ అధికారి బి.రామమోహన్ ను కలిశారు. ఈ సందర్భంగా వీఆర్ఏలు మాట్లాడుతూ ఉమ్మడి తిరుపతి రెవిన్యూ డివిజిన్ పరిధిలోని అర్హులైన గ్రామ రెవెన్యూ సహాయకులకు ఆఫీస్ సబార్డి నేట్ /వాచ్మెన్ ప్రమోషన్ విషయమై ఇంత వరకు నిర్ణయం తీసుకోలేదని మనవి చేస్తూ తొందరగా అర్హులైన వీఆర్ఏ ల సీనియా రిటీ లిస్టు తయారు చేసి డివిజన్ పరిధిలో గల మండలాలకు పబ్లిష్ చేయాలని కోరడమైనదని తెలిపారు.ఆర్డీవో స్పందిస్తూ తొరలోనే సీనియారిటీ లిస్టు మండలాలకు పంపుతామని హామీ ఇవ్వండం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా నాయకులు వై. లక్ష్మణ్, సాంబయ్య, అంకయ్య, నాగరాజు, బాబు, తదితర వీఆర్ఏలు పాల్గొన్నారు.