నెల్లూరు/అమరావతి,మన న్యూస్, ఏప్రిల్ 22:– రాష్ట్రాభివృద్ధే ధ్యేయంగా ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడుగారు మంగళవారం ఢిల్లీ పర్యటనలో భాగంగా పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. టీడీపీ ఎంపీలతో కలిసి కేంద్రమంత్రులను కలసిన సీఎం చంద్రబాబు గారు.. ఈ మేరకు రాష్ట్రానికి వివిధ అంశాలపై ఆయన కేంద్రమంత్రులకు వివరించారు. ఈ పర్యటనలో నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి గారు పాల్గొని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్, కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్, కేంద్ర వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రి పియూష్ గోయల్‌ను కలిశారు. పలు అంశాలను వారి దృష్టికి తీసుకువెళ్లారు. పర్యటనలో కేంద్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ తదితరులు ఉన్నారు.