

Mana News, Nellore :- నెల్లూరు మాగుంట లేఔట్ లో గల ఓవెల్ జూనియర్ కళాశాల విద్యార్థులు జాతీయ స్థాయి అత్యున్నత పోటీపరీక్షలైన జెఇఇ మెయిన్స్(2025 )పరీక్షలలో అసాధారణ ఫలితాలను సాధించారు.
ఈ సందర్భంగా శనివారం ఓవెల్ విద్యాసంస్థల చైర్మన్ మరియు ఓవెల్ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ రంగిశెట్టి వేణు విద్యార్థులను సత్కరించారు.ఈ సందర్భంగా రంగశెట్టి వేణు మాట్లాడుతూ…. జాతీయ స్థాయి మెయిన్స్ ఫలితాలలో ఓవెల్ జూనియర్ కళాశా సరికొత్త రికార్డు సృష్టించిందని హర్షం వ్యక్తం చేశారు.
వీరుతో పాటు 18 మంది విద్యార్థులు 91% పైగా ఫలితాలను సాధించడం పాటు 50 మందికి పైగా విద్యార్థులు జెఇఇ మెయిన్స్ అడ్వాన్స్ పరీక్షకు అర్హత సాధించడం నెల్లూరు నగరంలో ఓవెల్ జూనియర్ కళాశాల మాత్రమే సాధించిన అరుదైన రికార్డనని తెలిపారు.సబ్జెక్టు వారీగా ఫిజిక్స్ 99.76 %,కెమిస్ట్రీ 99.41%,మ్యాథ్స్ 98.79% సాధించామని తెలియజేశారు. పాన్ ఇండియా స్థాయి లెక్చరర్స్ చే బోధన మరియు ప్రణాళిక విద్యార్థులందరిపై వ్యక్తిగత శ్రద్ధను చూపిస్తూ..నిత్యం వారికి తగిన కౌన్సిలింగ్ అందిస్తూ… ఆరోగ్యకరమైన సరికొత్త విద్యా విధానాలతో తల్లిదండ్రుల సహకారంతో ముందుకు సాగడమే తమ విజయానికి మూల కారణమని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఓవెల్ విద్యాసంస్థల సంస్థల సీఈవో ఆర్.ప్రమీల,జిఎం మహదేవన్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బాలు, డిజిఎం టీం లీడర్ సుధీర్ బాబు, ఏజీఎం గంగాధర్, ఎగ్జిక్యూటివ్ ఇంచార్జ్ ఏ ఎం విద్య, కళాశాల అధ్యాపకులు,విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఎం వెంకట సుధా హేమంత్ 99.43% ఇ.కృష్ణవంశీ 98.52%, వై.వి చరణ్ తేజ 98.61 %, ఎస్ డి హాస్టల్ షరీఫ్ 98.26%, వి.బాల హర్షిత 98.02%, ఏ. దుర్గా హనుమంతు ప్రసాద్ 97.43%, ఆర్ యశ్వంత్ 94. 81%, బి. అవినాష్ 94.20%,సిహెచ్ యశ్విత 93.22%, ఎ. సాయి దుర్గా చరణ్ 91.57%, ఎం మోహన్ ప్రియ 91.57%,పటాన్ లుక్మాన్ 91.39%, షేక్ కాసిఫ్ 89.96%,కె.చిన్మయి 87.51%, పి రెడ్డి రుష్మిత 86.96%, కె. సౌమ్య ప్రియా 86.05%, ఆర్ రేవంత్ 85.82%, బి సుచరిత కుమార్ 84.47%, కె. లక్ష్మీ మోహన్ 82.33%,బి.బాలసుబ్రమణ్యం 67.94% ఫలితాలతో మా విద్యార్థులు విద్యార్థులు ఘన విజయం సాధించారు.
