

మన న్యూస్ సింగరాయకొండ:- సింగరాయకొండలోని ఎ.ఆర్.సి జి.వి.ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మార్చిలో నిర్వహించిన ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను కళాశాల ప్రిన్సిపాల్ శ్రీమతి ఎం. సౌజన్య అధ్యక్షతన సన్మానించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ గారు మాట్లాడుతూ, BiPC గ్రూపులో చదువుతున్న విద్యార్థి ప్రళయకావేరి సాయిరామ్ 1000కి 972 మార్కులు సాధించి, ప్రకాశం జిల్లా ప్రభుత్వ జూనియర్ కళాశాలలలో మొదటి స్థానం పొందినట్టు తెలిపారు. అలాగే CEC గ్రూపులో తన్నీరు సింధు 851 మార్కులు సాధించిందని తెలిపారు.విద్యార్థుల అంకితభావం, అధ్యాపకుల మార్గనిర్దేశన వల్ల ఈ విజయాలు సాధ్యమయ్యాయని ఆమె అభినందిస్తూ, భవిష్యత్తులో కూడా వారు ఉన్నతస్థాయికి చేరాలని ఆకాంక్షించారు. ప్రభుత్వం అందించే శిక్షణ, నాణ్యమైన బోధనతో సింగరాయకొండ ప్రభుత్వ కళాశాల ఒక ఉత్తమ విద్యా కేంద్రంగా నిలుస్తుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
