గూడూరులో స్వచ్ఛ- ఆంధ్ర స్వర్ణాంధ్ర భాగంగా ఈ వ్యర్ధాలపై అవగాహన కార్యక్రమం

మన న్యూస్,గూడూరు, ఏప్రిల్ 19:– గూడూరులో స్వచ్ఛ ఆంధ్ర -స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈ వ్యర్ధాలపై ఏర్పాటుచేసిన అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర రావు మరియు గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్. ఈ సందర్భంగా తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర రావు మాట్లాడుతూ………….. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాలు మేరకు ప్రతి నెలా మూడో శనివారం ఒక ప్రత్యేక థీమ్ తో స్వచ్ఛాంధ్ర – స్వర్ణాంధ్ర కార్యక్రమం నిర్వహిస్తున్నారు అని అన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి,లేకుంటే అనేక రకాల వ్యాధులు వస్తాయి అని తెలిపారు. ఈ రోజు ఈ వ్యర్థాలు పై అవగాహన కార్యక్రమం చేసుకోవడం సంతోషం గా ఉంది అని అన్నారు. మనకంటే ముందు అభివృద్ధి చెందిన జపాన్ లాంటి దేశాలు లో గత 30 ఏళ్ల క్రితమే ఈ వ్యర్థాలు భూగర్భం లో చేరి తాగునీరు కలుషితం అయిపోయి కాన్సర్ కారకాలుగా మారిపోయాయి అని నిర్ధారణ అయింది అని అన్నారు. యూరప్ దేశాల లో ఈ వ్యర్థాల తో అనేక రకాల మెటల్ లు తయారు చేసి సంపద సృష్టిస్తున్నారు అని అన్నారు.ప్రతి నెలా మూడో శనివారం ప్రజలు తో పాటు ప్రభుత్వ కార్యాలయాల్లో స్వచ్ఛాంధ్ర – స్వర్ణాంధ్ర కార్యక్రమం నిర్వహించాలి అని అన్నారు.ప్రజలకు ఇబ్బందిగా మారిన సూళ్లూరుపేట లో డంపింగ్ యార్డును తొలగించేందుకు ప్రయత్నం చేస్తున్నాం అని తెలియజేశారు. గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ సహకారం తో నియోజక వర్గం అభివృద్ధి చేస్తాం అని తెలిపారు. గూడూరు చెరువు ను ట్యాంక్ బండ్ తరహాలో అభివృద్ధి చేస్తాం అని తెలియజేశారు.నియోజక వర్గం లో ఇరిగేషన్ పనులు కు నిధులు మంజూరు చేస్తాం అని అన్నారు. అసంపూర్తిగా ఆగిపోయిన గూడూరు వన్ టవున్ టూ టవున్ లను కలిపే ఫ్లై ఓవర్ బ్రిడ్జి రాబోయే రెండు మూడు సంవత్సరాల్లో పూర్తి చేస్తాం అని అన్నారు.మంత్రి తో మాట్లాడి తెలుగు గంగ నీరు గూడూరుకు వచ్చేలా చర్యలు తీసుకుంటాం అని తెలియజేశారు. కాంట్రాక్టర్ నిర్మాణం లో ఆలస్యం చేయడం తోనే గూడూరు ప్రభుత్వ ఆసుపత్రి ప్రారంభం ఆలస్యం అయింది, తొందర్లో గూడూరు ప్రభుత్వ ఆసుపత్రి పనులు పూర్తి చేస్తాం అని అన్నారు.గూడూరు గ్రేడ్ వన్ లో బాగంగా 5 పంచాయితీలు విలీనం ప్రక్రియ పూర్తి తొందర లో పూర్తిచేస్తాం అని అన్నారు.
గూడూరు ను వెనకబడిన నియోజక వర్గం నుండి అభివృద్ధి చెందిన నియోజక వర్గంగా తీర్చి దిద్దడం లో గూడూరు ఎమ్మెల్యే తో కలిసి పనిచేస్తాం అని అన్నారు. స్వచ్ఛాంధ్ర – స్వర్ణాంధ్ర లో బాగంగా పరిసరాలు ను సుబ్రంగా ఉంచుతున్న మున్సిపల్ కార్మికులకు చేతులు ఎత్తి నమస్కరిస్తున్న అని కలెక్టర్ వెంకటేశ్వర రావు తెలియచేసారు. అనంతరం గూడూరు నియోజకవర్గం అభివృద్ధికి సంబంధించి పెండింగ్ లో వున్న పనులు తో పాటు చేయాల్సిన అభివృద్ధి పనులు పై జిల్లా కలెక్టర్ కు తెలియచేసిన గూడురు ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్. ఈ సందర్భంగా గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ మాట్లాడుతూ…….. గూడూరు లో ఆగిపోయిన ఫ్లై ఓవర్ నిర్మాణం పూర్తి చేయాలి అని అన్నారు.పంబలేరు వాగుపై బ్రిడ్జి పెండింగ్ పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకు రావాలి అని తెలిపారు.నత్తనడకన సాగుతున్న ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణం పనులు త్వరిత గతిన పూర్తిచేయాలి అని అన్నారు.గూడూరు నియోజక వర్గం లో సిలికా,క్వార్జ్,ఇసుక లభిస్తుంది కాబట్టి డబ్బున్న నియోజక వర్గం అనుకుంటారు కానీ ఆ డబ్బులు ఎక్కడకు వెళుతున్నాయో తెలియడం లేదు కానీ పరిస్థితులు మీకు తెలుసు..ఇక్కడ అధిక శాతం ప్రజలు పేదరికం లో ఉన్నారు అని తెలియజేశారు.గూడూరు మున్సిపాలిటీ పరిధిలో అభివృద్ధి జరగాలంటే కమిషనర్ కు చెక్ పవర్ కల్పించాలి అని తెలిపారు . గూడూరు ను గ్రేడ్ వన్ మున్సిపాలిటీ కింద చుట్టుపక్కల ఉన్న 5 గ్రామాలు ను కలిపారు కానీ ఆ ప్రక్రియ పూర్తి కాక పోవడం తో గూడూరు మున్సిపల్ ఎన్నికలు జరగడం లేదు,ఆ ప్రక్రియ పూర్తి చేయాలి…అని ఎమ్మల్యే పాశం సునీల్ కుమార్ జిల్లా కలెక్టర్ ను కోరారు.

Related Posts

అనధికారిక లేఔట్లను ఎల్.ఆర్.ఎస్ ద్వారా రెగ్యులైజ్ చేయించుకోండి…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

మన ధ్యాస,కోవూరు, సెప్టెంబర్ 12: అక్రమ లేఅవుట్లను ఆదిలోనే అడ్డుకునే విషయంలో అధికారులు కఠినంగా వ్యవహరించాలి .కోవూరు నియోజకవర్గ పరిధిలో నుడా నిబంధనలు పాటించని అనధికార లే అవుట్ల యజమానులు 2025 అక్టోబర్ 30వ తేదీ లోపు అపరాధ రుసుం చెల్లించి…

ప్రజల అవసరాలు గుర్తించి పరిపాలన చేసే మానవతావాది చంద్రబాబు నాయుడు………. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

మన ధ్యాస ,ఇందుకూరుపేట ,సెప్టెంబర్ 12:. జగదేవి పేటలో 50 లక్షలతో సిసి రోడ్ల ప్రారంభోత్సవం. – మరో 50 లక్షల నుడా నిధులతో డ్రైన్ల నిర్మాణానికి శ్రీకారం .అభివృద్ధి, సంక్షేమం ఏకకాలంలో అమలు చేసే పాలనా దక్షత ముఖ్యమంత్రి చంద్రబాబు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

అనధికారిక లేఔట్లను ఎల్.ఆర్.ఎస్ ద్వారా రెగ్యులైజ్ చేయించుకోండి…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

అనధికారిక లేఔట్లను ఎల్.ఆర్.ఎస్ ద్వారా రెగ్యులైజ్  చేయించుకోండి…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

ప్రజల అవసరాలు గుర్తించి పరిపాలన చేసే మానవతావాది చంద్రబాబు నాయుడు………. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

ప్రజల అవసరాలు గుర్తించి పరిపాలన చేసే మానవతావాది చంద్రబాబు నాయుడు………. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

మరోసారి మానవత్వం చాటుకున్న గంగవరం ఆడపడుచులు…

మరోసారి మానవత్వం చాటుకున్న గంగవరం ఆడపడుచులు…

అచ్చంనాయుడుది నోరేనా ………మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి

అచ్చంనాయుడుది  నోరేనా ………మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి

ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆటో డ్రైవర్లు పండుగ వాతావరణంలో ఉన్నారు…….. షేక్ అబ్దుల్ అజీజ్, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి

ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆటో డ్రైవర్లు పండుగ వాతావరణంలో ఉన్నారు……..  షేక్ అబ్దుల్ అజీజ్, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి

నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా ఆంధ్రప్రదేశ్ సమాచార మరియు ప్రజా సంబంధాల (ఐ అండ్ పి ఆర్) శాఖ డైరెక్టర్ హిమాన్షు శుక్లా