

మన న్యూస్ తిరుపతి :- కీర్తిశేషులు దేవరపల్లి గురుదాస్ 13వ వర్ధంతి సందర్భంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ తల్లి దీవెన ఆటో స్టాండ్ నందు అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా 1500 మందికి అన్నదాన కార్యక్రమం చేసినట్లు కుటుంబ సభ్యులు తెలియజేశారు. ఈ విధంగా గత 13 సంవత్సరాలుగా దేవరపల్లి గురుదాస్ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లుగా దేవరపల్లి గురుదాస్ కుటుంబ సభ్యులు మరియు మిత్రులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దేవరపల్లి గురుదాస్ కుటుంబ సభ్యులు, భార్య పద్మావతి, కుమారులు జగదీష్ ,చందు కూతురు నాగవేణి, అల్లుడు రంజిత్ , మరియు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ తల్లి దీవెన ఆటో స్టాండ్ గౌరవ అధ్యక్షులు బాలకృష్ణ, డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు.
