పార్టీ ఫిరాయింపు కేసుపై సుప్రీంలో విచారణ 

Mana News, న్యూఢిల్లీ, ఏప్రిల్ 2: తెలంగాణలో ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు కేసుపై సుప్రీం కోర్టులో (Supreme Court) ఈరోజు (బుధవారం) విచారణ ప్రారంభమైంది. బీఆర్ఎస్ నేతలు పాడి కౌశిక్ రెడ్డి, కేటీఆర్, బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ జరుగుతోంది. గత విచారణ సందర్భంగా పిటిషనర్ల తరఫున న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఈరోజు ప్రతివాదులుగా ఉన్న తెలంగాణ అసెంబ్లీ స్పీకర్, ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న 10 మంది ఎమ్మెల్యేల తరఫున సీనియర్ న్యాయవాదులు ముకుల్ రోహత్గి, అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించనున్నారు.ఇప్పటికే స్పీకర్ తరపున స్పీకర్ కార్యదర్శి కౌంటర్‌ను దాఖలు చేశారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ నిర్ణయం తీసుకోవడం ఆలస్యం చేస్తున్నారన్న ఆరోపణలను అఫిడవిట్‌లో ఖండించారు. స్పీకర్ చట్టపరమైన విధులను అనుసరిస్తున్నారని, స్పీకర్ నిర్ణయం తీసుకున్న తరువాతే న్యాయపరమైన పరిష్కారం సాధ్యమని, అంతవరకు కోర్టులు స్పీకర్ విధుల్లో జోక్యం చేసుకోలేరంటూ స్పష్టంగా తన కౌంటర్‌లో దాఖలు చేశారు. స్పీకర్ ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేశారనడానికి ఎలాంటి కారణాలు లేవని, స్పీకర్ వద్ద పిటిషన్‌లు పెట్టుకున్న 20 రోజులకే బీఆర్‌ఎస్ నేతలు కోర్టును ఆశ్రయించారని, స్పీకర్‌పై వారు చేసిన ఆరోపణలు అసంబద్ధమైనవని, రాజ్యాంగంలోని పదవ షెడ్యూల్‌లోని క్లాజ్ 6 కింద స్పీకర్‌కు ఫిరాయింపులపై నిర్ణయం తీసుకునేందుకు పూర్తి అధకారాలు ఉన్నాయన్నారు.అంతేకాకుండా అసెంబ్లీ సమావేశమై పదిహేను నెలలు కూడా కాలేదు, అసెంబ్లీ పదవీకాలం ముగిసేలోపు అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోబోరన్న ఆరోపణల్లో కూడా పసలేదని, ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని స్పీకర్‌ను ఆదేశించాలని కోరుతున్న పిటిషనర్లకు నోటీసులు ఇచ్చామని, వారి ఇచ్చే సమాధానాలు విన్నాక సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటామని, స్పీకర్ విశేషమైన అధికారాలు ఉన్నాయని అఫిడవిట్‌లో పేర్కొన్నారు. అలాగే మణిపూర్ ఎమ్మెల్యే ఫిరాయింపు కేసులో కూడా 1992లో సుప్రీం కోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పులో కూడా స్పీకర్‌కే నిర్ణయం తీసుకునే అధికారాలు ఉన్నాయన్న విషయాన్ని కూడా కౌంటర్‌లో గుర్తుచేశారు. మరోవైపు ఈ కేసులో పిటిషనర్ల తరుపు వాదనలు విన్న సుప్రీం కోర్టు… గతంలో ఇచ్చిన తీర్పులను కాదని ఎలా చెబుతామని, ఎప్పటిలోగా నిర్ణయం తీసుకోవాలనే దానిపై ధర్మాసనం చెప్పలేదని, వాటికి భిన్నంగా ఎలా నిర్ణయం తీసుకుంటామని సుప్రీం వ్యాఖ్యానించింది. ఈ క్రమంలో ఈరోజు సుప్రీం కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందో వేచి చూడాలి.

Related Posts

సర్పంచుల్లో ఉత్తముడు. వ్యాసాపురం సీతారాముడు.

ఉరవకొండ, మన న్యూస్: మండల పరిధిలోని వ్యాసాపురం సర్పంచ్ సీతారాములు ఉత్తమ సర్పంచుగా ఎంపికైన సంగతి విధితమే. ఢిల్లీలో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఆయనను ప్రత్యేకంగా ఆహ్వానించి షాలు ఒక అప్పి పూలమాలలు వేసి మెమొంటోను బహుకరించారు. సర్పంచు…

దగ్గుబాటిని, చిరంజీవి ఆదర్శంగా తీసుకోవాలి.-చిరంజీవికి రెండేసి పెన్షన్లు అవసరమా!

కూటమి మాజీ ప్రభుత్వ నేతలకు ఒక్కొక్కరికి రెండేసి పెన్షన్లు.ఉరవకొండ మన న్యూస్: మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యులు డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు పొందుతున్న రెండేసి పెన్షన్లను స్వచ్ఛందంగా వదులుకొని అందరికీ ఆదర్శంగా నిలిచారుకాగా చిరంజీవి ఆదర్శంగా నిలిచి రెండేసి పెన్షన్లను తక్షణమే…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

సింగరాయకొండ మండలంలో అధికారులతో సమీక్షా సమావేశం

  • By JALAIAH
  • September 10, 2025
  • 2 views
సింగరాయకొండ మండలంలో అధికారులతో సమీక్షా సమావేశం

పాకల జడ్పీహెచ్ఎస్‌లో మహిళాభివృద్ధి శాఖ అవగాహన కార్యక్రమం

  • By JALAIAH
  • September 10, 2025
  • 3 views
పాకల జడ్పీహెచ్ఎస్‌లో మహిళాభివృద్ధి శాఖ అవగాహన కార్యక్రమం

మదర్ ల్యాండ్ సొసైటీ స్వచంద సంస్థ ఆధ్వర్యం హెచ్ ఐ వి/ ఎయిడ్స్ , మత్తు పదార్దాల వినియోగం పై అవగాహన కార్యక్రమం

  • By JALAIAH
  • September 10, 2025
  • 3 views
మదర్ ల్యాండ్ సొసైటీ స్వచంద సంస్థ ఆధ్వర్యం హెచ్ ఐ వి/ ఎయిడ్స్ , మత్తు పదార్దాల వినియోగం పై అవగాహన కార్యక్రమం

రసాయనక ఎరువుల వాడకాన్ని తగ్గిద్దాం నానో యూరియా ఎరువులను అలవాటు చేసుకుందాం..!

  • By JALAIAH
  • September 10, 2025
  • 4 views
రసాయనక ఎరువుల వాడకాన్ని తగ్గిద్దాం నానో యూరియా ఎరువులను అలవాటు చేసుకుందాం..!

నాయక్ పోడు కులస్థుల రాస్తారోకో…కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్న తహసీల్దార్..

  • By RAHEEM
  • September 10, 2025
  • 8 views
నాయక్ పోడు కులస్థుల రాస్తారోకో…కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్న తహసీల్దార్..

కొండేపి నియోజకవర్గంలో బాలినేని ప్రణీత్ రెడ్డి ఆధ్వర్యంలో 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చెక్కులు పంపిణీ

  • By JALAIAH
  • September 10, 2025
  • 9 views
కొండేపి నియోజకవర్గంలో బాలినేని ప్రణీత్ రెడ్డి  ఆధ్వర్యంలో 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చెక్కులు పంపిణీ