మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం: కార్మిక కర్షక ఉద్యోగ సమస్యల పరిష్కారానికి ఈ నెల 12న జరిగే దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్షుడు దువ్వ శేషు బాబ్జి పిలుపునిచ్చారు. స్థానిక సిఐటియు కార్యాలయంలో అనుబంధ సంఘాల రౌండ్ టేబుల్ సమావేశానికి దువ్వ శేషు బాబ్జి ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ సందర్భంగా బాబ్జి మాట్లాడారు. అసలైన కార్మిక చట్టాలను తుంగలోకి తొక్కి నూతన లేబర్ కోడ్ ద్వారా కార్మికుల హక్కులను కేంద్రం హరించిందన్నారు. కార్పొరేట్లకు తొత్తుగా మారిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలను విడనాడాలని పిలుపునిచ్చారు. సమస్యల పరిష్కారం కోరుతూ జరిగే దేశవ్యాపిత సమ్మెను ప్రతి ఒక్క కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి పాకలపాటి సోమరాజు,సిఐటియు మండల అధ్యక్షురాలు కాకరపల్లి సునీత,అమలావతి,పిల్ల రాంబాబు, అడపా శివ, ఆశా కార్యకర్తలు నాయకురాలు గంగాభవాని ఉన్నారు.

By DURGASRINIVAS

Good

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *