

ఎస్ ఆర్ పురం, మన న్యూస్.. జర్నలిస్టుల సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే డాక్టర్ థామస్ అన్నారు బుధవారం గంగాధర నెల్లూరు నియోజకవర్గం,ఎస్ఆర్ పురం మండలం కేంద్రంలో ఏపీజేడబ్ల్యూ యూనియన్ ప్రెస్ క్లబ్ ను ప్రభుత్వ విప్ గంగాధర నెల్లూర్ ఎమ్మెల్యే డాక్టర్ వి.ఎం థామస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో ఉన్న మీడియా మిత్రులకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తానని నియోజకవర్గంలో ఉన్న మీడియా మిత్రులను తాను ఎప్పుడు మీడియా మిత్రులు చూడలేదని నా సొంత అన్నదమ్ముల్లాగా చూస్తానని అదేవిధంగా ప్రెస్ క్లబ్ సొంత భవనానికి స్థలం కేటాయిస్తానని పేర్కొన్నారు.త్వరలోనే మీడియా మిత్రులకు ఇళ్ల స్థలాలను నియోజకవర్గంలో ఎంతమంది విలేకరులు ఉన్న వారికి మూడు సెంట్లు భూమిని కేటాయిస్తానని ప్రెస్ క్లబ్ కు తన వంతు సహాయ సహకారాలను అందిస్తానని బహిరంగ హామీల వర్షం కురిపించారు. మీడియా మిత్రులకు ఏ సమస్య ఉన్న తనకు వెంటనే తెలియజేస్తే పరిష్కరిస్తానని అన్నారు అంతకుముందుగా ప్రభుత్వ విప్ జీడీ నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ వి.ఎం థామస్ ను ఏపీడబ్ల్యూజే నాయకులు సన్మానించి, పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు లోకనాథం,చిత్తూరు ప్రెస్ క్లబ్ అధ్యక్షులు రమేష్ బాబు, సెక్రటరీ కాలేశ్వర్ రెడ్డి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు జయప్రకాష్, ఆంధ్రజ్యోతి బ్యూరో కరీం , జిల్లా ఈసీ మెంబర్ రాజేష్, రమేష్, వెంకటేష్, నియోజకవర్గ ప్రెస్ క్లబ్ నిర్వాహకులు తిరుమల, నియోజకవర్గ మీడియా మిత్రులు తదితరులు పాల్గొన్నారు.
