

మనన్యూస్,తిరుపతిఃరాష్ట్ర ప్రభుత్వం ముస్లీం సోదరులకు ఇప్తార్ విందు ఇచ్చింది. స్థానిక ఆర్సీ రోడ్డులోని షాదిమహల్ లో బుధవారం సాయంత్రం నమాజ్ అనంతరం ఇప్తార్ విందు జరిగింది. ఇప్తార్ విందును రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ, వక్ప్ బోర్డ్ సంయుక్తంగా ముస్లీంలకు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ముఖ్యఅథిదిగా పాల్గొని ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం రోజా విడిచాక ఇప్తార్ విందులో ఆయన పాల్గొన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ముస్లీంలను అన్ని విధాలా ఆదుకుంటుందని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు చెప్పారు. ముస్లీం సోదరలకు రంజాన్ శుభాకాంక్షలు ఆయన తెలిపారు. ఏటా రంజాన్ మాసంలో ఉపవాస దీక్షతో అల్లాను ముస్లీంలు కొలవడం ఆనవాయితీగా వస్తోందని ఆయన చెప్పారు. అల్లా దయ ముస్లీంలందరిపై మెండుగా ఉండాలని కోరుకుంటున్నట్లు ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా మైనార్టీ వెల్ఫేర్ ఆఫీసర్ చిన్నారెడ్డి, డిఆర్ ఓ నరసింహులు, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, యాదవ కార్పోరేషన్ ఛైర్మన్ నరసింహ యాదవ్, డిప్యూటీ మేయర్ ఆర్సీ మునికృష్ణా, పులుగోరు మురళీ, దంపూరు భాస్కర్ యాదవ్, మహబూబ్ బాషా, ఎస్ కే బాబు, ఎస్ ఎండి రఫీ, రఫీ హిందూస్థానీ, నసిరుద్దీన్, షాబీర్, హర్షద్, సర్వరూద్దీన్, జమాల్, రాజా రెడ్డి, చిన్నబాబు, పుష్పావతి యాదవ్, మహేష్ యాదవ్, నైనార్ శ్రీనివాస్, కెఎంకే లోకేష్, జీవకోన సుధా, ఆముదాల వెంకటేష్, వంశీ తదితరులు పాల్గొన్నారు.
