

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తాను నటించిన మట్కా మూవీ రేపు (నవంబర్ 14 గురువారం) విడుదల కానున్న నేపథ్యంలో శ్రీవారి ఆశీస్సులు తీసుకునేందుకు తిరుమల వచ్చారు. మట్కా మూవీ టీమ్‌తో కలిసి ఆయన శ్రీవారిని దర్శించుకున్నారు.దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించగా, ఆలయ అధికారులు వారికి తీర్థప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు.ఇక మూవీ విషయానికి వస్తే.. వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్, ఎస్ఎం.ఆర్ట.టి. ర్‌టైన్‌మెంట్స్‌పై డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి సంయుక్తంగా మట్కా మూవీని నిర్మించారు. కరుణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో మీనాక్షి చౌదరీ కథానాయిక. 1960 బ్యాక్‌డ్రాప్‌తో పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా, గ్యాబ్లింగ్ కథాంశంతో మట్కా సినిమా తెరకెక్కింది.నవీన్ చంద్ర, నోరా ఫతేహి, సలోని.. పలువురు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పాటు, టీజర్, ట్రైలర్ లు సినిమా పై అంచనాలను భారీగా పెంచాయి.