ప్రైవేటు పాఠశాలలలో మౌలిక వసతుల జాడేది.

తీరని విద్యార్థుల దాహం..!

నిబంధనలను బేకాతర్ చేస్తున్న ప్రైవేటు యాజమాన్యాలు

మౌలిక వసతులను పకడ్బందీగా అమలు చేయాలి

జిల్లా,మండల విద్యాశాఖ అధికారికి
సామాజిక కార్యకర్త కర్నె రవి వినతి

మనన్యూస్,పినపాక నియోజకవర్గం:మణుగూరు విద్యార్థుల నుంచి వేలకు వేల రూపాయలను ఫీజులుగా తీసుకుంటున్న ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు విద్యార్థులకు కనీస మౌలిక వసతుల కల్పన విషయంలో మాత్రం ఏం పట్టనట్లు వ్యవహరిస్తున్నారని, ప్రభుత్వ నిబంధనలు పాటించని ఆయా ప్రైవేట్ విద్యాసంస్థలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని, విద్యార్థులకు కనీస సౌకర్యాలు కల్పించాలని, సామాజిక కార్యకర్త కర్నె రవి
జిల్లా విద్యాశాఖ అధికారి కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..విద్యార్థుల తల్లిదండ్రులను ఆకర్షించేందుకు రకరకాల పేర్లతో పినపాక నియోజకవర్గం లో ప్రైవేట్ పాఠశాలలను ఏర్పాటు చేస్తున్నా యాజమాన్యాలు
ఒలంపియాడ్, టెక్నో, డిజిటల్‌, ఇంటర్‌నేషనల్‌, ఫౌండేషన్‌ వంటి తోక పేర్లతో పాఠశాలలను ఏర్పా
టు చేస్తున్నారని, ఆరోపించారు. ఇలాంటి స్కూల్ లను నిర్వహించవద్దని ప్రభుత్వం పలుమార్లు ఆదేశాలు కూడా ఇచ్చింది. కానీ తమను ఆపేది ఎవరన్నట్టు… పలు ప్రైవేటు బడుల యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా ముందుకెళ్తున్నాయన్నారు.ఓవైపు యథేచ్చగా ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు పాఠశాలలు…. విద్యార్థులకు కనీస వసతలు కల్పించడంలో విఫలమ
వుతున్నాయని, అగ్రహం వ్యక్తం చేశారు.ప్రైవేటు బడుల నిర్వహణ విషయంలో ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉన్నప్పటికీ ఆశించిన మేర అమలు కావటం లేదన్నారు.ఇంగ్లీషు మీడియంపై మోజు, కార్పొరేటు స్కూళ్లపై వ్యామోహంతో తమ బిడ్డల భవిష్యత్ బాగుండాలని ప్రైవేట్ పాఠశాలల్లో చేర్పిస్తున్న తల్లిదండ్రులకు కన్నీరే మిగులుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. పీజుల పేరుతో లక్షలు కుమ్మరిస్తున్నా సౌకర్యాలు మాత్రం కరువయ్యయన్నారు. కోన్ని ప్రైవేట్ పాఠశాల
ల్లో విద్యార్థుల దాహం తీరడం లేదని, పాఠశాలల్లో సౌకర్యాలు మేడిపండు చందంగా ఉన్నాయని పేర్కొన్నారు.రోజంతా బడిలో గడిపే ఆడిపాడే విద్యార్థులకు ఇంటి నుంచి తెచ్చుకునే లీటరు మంచినీరు ఏ మాత్రం చాలడం లేదని,దీంతో పాఠశాలల్లో ఉన్న చేతిపంపులు, కుళాయిలు, వాటర్‌ ట్యాంకుల్లో రక్షితం కాని నీటినే తాగుతున్నారని,దీంతో విద్యార్థులు పలు మార్లు జబ్బుల బారిన ఘటనలు ఉన్నాయన్నారు. ఒకవైపు వేసవితో మండే ఎండలు
ఇరుకైన గదులలో విద్యార్థులకు
వేడినీరే ఆధారమవుతుందని, సౌకర్యాలు కల్పించాల్సిన ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు కనీసం స్పందించకుండా కూల్ వాటర్ ను కూడా అందుబాటులో ఉంచకుండా విద్యార్థుల జీవితాల
తో చెలగాటమాడుతున్నాయన్నా
రు.ప్రైవేటు పాఠశాలలలో మౌలిక వసతుల జాడే మచ్చుకైనా కనిపించడం లేదని ధ్వజమెత్తారు.
చాలా ప్రైవేటు పాఠశాలలకు సరైన భవనాలు ఉండటం లేదని,అద్దెకు భవనాలతో గాలి, వెలుతు
రు కూడా సరిగా లేని బడులు చాలాచోట్ల దర్శనమిస్తున్నాయని,కొన్ని బడులకు ఫైర్ సెఫ్టీ కూడా లేదని, ఏదైనా ప్రమాదం జరిగితే బాధ్యులు ఎవరని ఆయన ప్రశ్నించారు. ప్రతి ప్రవేట్ పాఠశాలలో బిల్డింగ్ నిర్వహణ నుంచి టీచర్ల జీతాల వరకు ఏ విషయం తీసుకున్నా…. లోపాల పుట్ట బయటపడే పరిస్థితులు ఉన్నాయన్నారు. ఇప్పటికైనా జిల్లా విద్యాశాఖ అధికారులు స్పందించి ప్రైవేట్ పాఠశాలలలో తనిఖీలు చేపట్టాలని, విద్యార్థులకు కనీస మౌలిక వసతులను కలిపించాలని కర్నెరవి డిమాండ్ చేశారు.

  • Related Posts

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    మహేశ్వరం, మన ధ్యాస: మహేశ్వరం నియోజకవర్గంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో,కేబుల్ ఇంటర్నెట్ ఆపరేటర్లు మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి తమ సమస్యలను వివరించారు.రాష్ట్రవ్యాప్తంగా సుమారు 5 లక్షల మంది ఆపరేటర్లు ఈ వృత్తిపై ఆధారపడి…

    హసన్‌పల్లి గ్రామంలో విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం: మన ధ్యాస న్యూస్ కథనానికి స్పందన

    మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గత రెండు సంవత్సరాలుగా అధిక లోడు కారణంగా విద్యుత్ సరఫరాలో తీవ్రమైన సమస్యలు కొనసాగుతూ ఉండగా,మన ధ్యాస దినపత్రిక ఆదివారం ఒక కథనాన్ని ప్రచురించింది.ఇందులో ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి వదిలివేయబడినట్లు, అందువల్ల…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…

    • By NAGARAJU
    • September 12, 2025
    • 2 views
    నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…

    కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

    • By NAGARAJU
    • September 12, 2025
    • 3 views
    కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

    • By NAGARAJU
    • September 12, 2025
    • 6 views
    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

    ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు