

Mana News, Chittoor :- మహిళలతో వ్యభిచారం చేయిస్తున్న ముగ్గురిపై చిత్తూరు వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. స్థానిక పాత బస్టాండ్ సమీపంలోని ఓ లాడ్జిలో ముగ్గురు మహిళల చేత వ్యభిచారం చేయిస్తున్నారని పోలీసులకు సమాచారం అందింది. దాంతో ఆదివారం రాత్రి పోలీసులు లాడ్జిపై దాడి చేశారు. ఈ దాడిలో వ్యభిచారం చేయిస్తున్న ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
