
Mana News :- విజయానికి అదృష్టంతో సంబంధం లేదని మరోసారి నిరూపితమైందని జనసేన నేత నాగబాబు అన్నారు. జనసేనను భారత జట్టుతో పోల్చారు. ‘IND ఒక్క టాస్ గెలవకుండా అన్ని మ్యాచ్‌లు గెలిచి 12 ఏళ్లకు CT సాధించింది. ఒక్క MLA కూడా లేకుండా 12 ఏళ్లకు 100% స్ట్రైక్ రేట్‌తో గెలిచి JSP రాజ్యాధికారంలో భాగస్వామ్యమైంది. ఈ రెండింటికీ ఒకే విధమైన పోలికలు. ప్రణాళిక, ప్రాతినిధ్యం, కూర్పు, కసరత్తు, అంకితభావం, ఐకమత్యం’ అని ట్వీట్ చేశారు.
