

మాజీ సి యం వైయస్ జగన్మోహన్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేసిన వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ…పోలీసులకు ఫిర్యాదు అందజేసిన.వైసీపీ జిల్లా యువజన విభాగం అధ్యక్షులు కార్పొరేటర్ ఊటుకూరు నాగార్జున
మనన్యూస్,నెల్లూరు:వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో శనివారం ఉదయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా యువజన విభాగం అధ్యక్షులు, కార్పొరేటర్ ఊటుకూరు నాగార్జున ఈ నెల 5 వ తేదీ జనసేన నేతలు… మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారని సర్కిల్ ఇన్స్పెక్టర్ కు ఫిర్యాదు చేస్తూ.మెమొరాండం అందజేశారు.ఈ విషయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని ఈ ఘటన పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సిఐ ని కోరారు.ఈ సందర్భంగా ఊటుకూరు నాగార్జున మీడియా తో మాట్లాడుతూ
ఈరోజు వైసిపి జిల్లా అధ్యక్షులు కాకాణి గోవర్ధన్ రెడ్డి సిటీ ఇంచార్జ్ ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆదేశాల మేరకు జగన్మోహన్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం పై పోలీసులకు ఫిర్యాదు చేశామని తెలిపారు,ఈనెల 5వ తేదీ జనసేన నేతలు నెల్లూరు గాంధీ బొమ్మ సెంటర్ లో మాజీ సి యం వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేయడాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరసిస్తూ శనివారం పోలీసులకు ఫిర్యాదు చేసి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరామని తెలిపారు.సోషల్ మీడియాలో చిన్న చిన్న పోస్టులు పెట్టిన కారణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలను పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి వారిపై కేసులు బనాయిస్తున్నారని తెలిపారు.మాజీ సీఎం దిష్టిబొమ్మను దహనం చేస్తుంటే పోలీసులు చోద్యం చూస్తూ తూతూ మంత్రంగా వ్యవహరించడం బాధాకరమన్నారు.
ఈ ఘటనపై ఇప్పటికైనా పోలీసులు చర్యలు తీసుకుంటారని విశ్వాసం వ్యక్తం చేసి ఫిర్యాదు చేశామని తెలిపారు.2019 ఎన్నికల్లో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రెండు చోట్ల పోటీ చేసి ఒక్క చోట కూడా డిపాజిట్ కూడా దక్కించుకోకుండా దారుణంగా ఓడిపోయిన చరిత్ర పవన్ కళ్యాణ్ దని అన్నారు.2024 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని తెలుగుదేశం పార్టీ కాళ్ల దగ్గర తాకట్టుపెట్టి 21 సీట్లు తీసుకున్నారని ఎద్దేవా చేశారు అని అన్నారు.2019 ఎన్నికల్లో రాష్ట్రంలో 151 యొక్క స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచి జగన్మోహన్ రెడ్డి చరిత్ర సృష్టించారని అన్నారు.
మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడేటప్పుడు.. వారి స్థాయి తెలుసుకొని మాట్లాడాలని హితువు పలికారు.
ప్రతి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త జగన్మోహన్ రెడ్డి ని గుండెల్లో పెట్టి చూసుకుంటారని అన్నారు.కూటమి నేతలు ఇలాంటి చర్యలు కొనసాగిస్తే వారు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.అధికారం ఎవరికి శాశ్వతం కాదన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి అన్నారు.
రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం అధ్యక్షుడిగా యువతను అంతా ఏకం చేసి.. జిల్లాను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అడ్డగా మారుస్తానన్నారు.ఈ కార్యక్రమంలో వైసిపి జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షులు ఆశ్రిత రెడ్డి , వైసిపి ఆర్యవైశ్య విభాగం నాయకులు చీరల కిషన్ వైసీపీ నాయకులు పాల్గొన్నారు.
