

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం: మండలంలోని సిరిపురం,పేరవరం గ్రామాలలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, కమ్యూనిటీ భవనం వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ఎంపీపీ గొల్లపల్లి నరసింహమూర్తి(బుజ్జి) శుక్రవారం శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఎంపీపీ గొల్లపల్లి మాట్లాడుతూ ప్రత్తిపాడు నియోజకవర్గ శాసన సభ్యురాలు వరుపుల సత్య ప్రభ ఆదేశాల మేరకు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడం జరిగిందని,గ్రామాల అభివృద్ధి కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ సాదే లావరాజు, ఎంపీటీసీ కొప్పుల బాబ్జి, సిరిపురం గ్రామ సర్పంచ్ పీతల నూకరాజు,టిడిపి నాయకులు చిక్కాల లక్ష్మణరావు, ఓనం మంగ,శివ,ఆర్డబ్ల్యూజేఈ,కూటమి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.