Mana News, గుంటూరు: అమరావతి రాజధాని నిర్మాణం మూడేళ్లలో పూర్తి చేస్తామని మంత్రి నారాయణ తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలు కట్టే పన్నుల నుంచి ఒక్కపైసా కూడా రాజధాని నిర్మాణం కోసం ఖర్చు చేయబోమని స్పష్టం చేశారు. హడ్కో, ప్రపంచ బ్యాంకు రుణాలతోనే రాజధాని నిర్మిస్తామన్నారు. అధికారంలో ఉండగా జగన్‌ మూడు క్కలాట ఆడారని, ఇప్పటికైనా రాజధానిపై వైకాపా ఓ విధానంతో ముందుకు రావాలని హితవు పలికారు. ”రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్‌ చూసి వైకాపా నాయకులు ఫ్రస్టేషన్‌లో ఉన్నారు. అందుకే అమరావతిపై జగన్‌, ఆ పార్టీ నేతలు సైకోల్లా మాట్లాడుతున్నారు. అమరావతిలో భూములను అమ్మడం ద్వారా వచ్చే నిధులను మాత్రమే రాజధాని కోసం ఖర్చు చేస్తాం. రోడ్లు, డ్రైనేజీ, పార్కులు వంటి మౌలిక వసతులు పూర్తి కాగానే భూమి ధర పెరుగుతుంది. బడ్జెట్‌లో అమరావతికి కేటాయించిన రూ.6వేల కోట్లు ప్రజల ట్యాక్స్‌ల నుంచి వచ్చే నిధులు కాదు” అని నారాయణ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *