కన్న కూతురిపై లైంగిక దాడికి పాల్పడిన నేరస్తునికి 7 సంవత్సరాల జైలు శిక్ష

మనన్యూస్,కామారెడ్డి:కన్నా కూతురిపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో పోక్సో నేరస్తుడు అయిన జేర్రీపోతుల దేవరాజు,47 వ్యక్తికి 7సంవత్సరాల కఠిన కారాగార శిక్ష,రూ.10 వేలు జరిమానా విధిస్తూ కామారెడ్డి మొదటి అదనపు జిల్లా జడ్జి లాల్ సింగ్ శ్రీనివాస్ నాయక్ బుధవారం తీర్పు చెప్పారు.బీబీపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక గ్రామానికి చెందిన 15 ఏళ్ల మైనర్ బాలికను 2024 జనవరి 14న ఇంటి బయట అడుకుంటున్న కూతురిని ఇంట్లో ఎవరు లేరని తండ్రి అయిన జేర్రీపోతుల దేవరాజు ఇంట్లోకి పిలిచి కూతురిపై లైంగిక దాడికి పాల్పడటంతో అమె ఏడుస్తూ తీవ్ర భయాందోళనకు గురై తన తల్లి బీబీపేట మార్కెట్ వెళ్లి ఇంటికి రాగానే తల్లికి జరిగిన విషయాన్ని చెప్పడంతో 2024 జనవరి 15న స్ధానిక బీబీపేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి సాక్షులను విచారించి,నేరస్తుడిని అరెస్ట్ చేసి అన్ని సాక్షాదారాలను సేకరించి కోర్టులో అభియోగపత్రం దాఖలు చేశారు.కేసు పూర్వాపరాలు,సాక్ష్యాధారాలు,వైద్య నివేదికను పరిశీలించిన న్యాయ మూర్తి నిందితుడిపై మోపిన నేరం రుజువు అయిందని 07సంవత్సరాల కఠిన కారాగార శిక్ష,రూ.10 వేలు జరిమానా విధించడం జరిగింది.ఈ కేసును సరియగు పద్దతిలో విచారణ చేసిన అప్పటి డిఎస్పిలు శ్రీనివాసులు ప్రస్తుత ఎల్లారెడ్డి డిఎస్పి ఆర్.ప్రకాష్,నాగేశ్వర రావు,అప్పటి సిఐ తిరుపయ్య,ఎస్ఐ యస్.అనిల్,పోలీసు తరపున వాదనలు వినిపించిన స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ శేషు ని కోర్టులో సాక్షులను ప్రవేశపెట్టిన ప్రస్తుత కామారెడ్డి ఎఎస్పీ చైతన్య రెడ్డి ఐపిఎస్ ప్రస్తుత సిఐ సంపత్ కుమార్ ఎస్ఐ ప్రభాకర్,కోర్టు లైజనింగ్ ఆఫీసర్ ఎస్‌ఐ టి.మురళి, కోర్ట్ కానిస్టేబుల్ ప్రమోద్ రెడ్డి,ప్రవీణ్ లను జిల్లా ఎస్పీ అభినందించారు.

  • Related Posts

    హసన్‌పల్లి గ్రామంలో విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం: మన ధ్యాస న్యూస్ కథనానికి స్పందన

    మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గత రెండు సంవత్సరాలుగా అధిక లోడు కారణంగా విద్యుత్ సరఫరాలో తీవ్రమైన సమస్యలు కొనసాగుతూ ఉండగా,మన ధ్యాస దినపత్రిక ఆదివారం ఒక కథనాన్ని ప్రచురించింది.ఇందులో ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి వదిలివేయబడినట్లు, అందువల్ల…

    ట్రాన్స్ఫార్మర్‌ పెట్టారు.. కాలిపోయింది వదిలేశారు..ఇది విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం..

    మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గత రెండేళ్లుగా విద్యుత్ సమస్యలు తీవ్రరూపం దాల్చాయి. గ్రామంలోని మినీ ట్రాన్స్ఫార్మర్‌పై అధిక లోడు పడడం వల్ల తరచూ వైర్లు తెగిపడి కరెంటు సరఫరా నిలిచిపోతోంది.గ్రామస్థుల సమాచారం ప్రకారం,ఒకే ట్రాన్స్ఫార్మర్‌కు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

    ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 3 views
    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్ సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 5 views
    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///